పేదల కండ్లలో వెలుగులు


Thu,September 13, 2018 01:15 AM

పెద్దపల్లి టౌన్ : పేదల కండ్లళ్ల వెలుగులు చూడటమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని మున్సిపల్ చైర్మన్ ఎలువాక రాజయ్య పేర్కొన్నారు. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని 1వ వార్డులో బుధవారం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన చైర్మన్ మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన కంటి వెలుగు కార్యక్రమం పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలో ప్రారంభమైందని పట్టణంలోని ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రతి వార్డులో ఐదు రోజులు కంటివెలుగు కార్యక్రమం కొనసాగుతుందనీ, ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. పేదల సంక్షేమానికి పాటుబడుతున్న ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి పదవి చేపడుతేనే కలలు కన్న బంగారు తెలంగాణ సాధ్యమవుతుందనీ, అందుకోసం పెద్దపల్లి నియోజకవర్గ ప్రజల బాధ్యతగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేస్తున్న తాజా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డిని మరోసారి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. ఇక్కడ కౌన్సిలర్లు పస్తం హన్మంతు, తబ్రేజ్, వైద్యసిబ్బంది డాక్టర్ సంజీవ్‌కుమార్, నభీ, సూపర్‌వైజర్ రవి, ఎన్‌ఎం సరోజ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

పెద్దపల్లి : పెద్దపల్లి మండలంలోని కనగర్తి శిబిరంలో 154మంది కంటి పరీక్షలు చేసిన వైద్యులు 35మందికి ఉచిత మందులు, అద్దాలు అందజేసిన డాక్టర్లు మరో 12మందికి అద్దాలు అందించడానికి ఆర్డర్ చేశారు. 26 మందిని శస్త్ర చికిత్సలకు రెఫర్ చేశారు. రాఘవాపూర్ వైద్యులు నిర్వహించిన కంటివెలుగు శిబిరంలో 185మందికి ఉచిత మందులు, 45అద్దాలు అందజేసిన వైద్యులు మరో 11మందికి అద్దాలు అందించడానికి ఆర్డర్ చేశారు. 28మందిని శస్త్ర చికిత్సలకు రెఫర్ చేశారు. మండలంలో వేరువేరుగా జరిగిన ఉచిత కంటి వెలుగు శిబిరాలను వైద్యాధికారులు డాక్టర్ ఫనీంధ్ర, డాక్టర్ శ్రీజ పర్యావేక్షించగా వైద్యులు సంజీవ్‌కుమార్, సతీశ్‌రెడ్డి, బషీర్‌లు కంటి వైద్య పరీక్షలు చేశారు.

ధర్మారం : మండలం గోపాల్‌రావుపేట గ్రామంలో కంటి వెలుగు శిబిరం కొనసాగుతున్నది. ఈ గ్రామంలో ఈ నెల 10 నుంచి శిబిరం ప్రారంభమైంది. నేత్ర వైద్యుడు, శిబిరం బాధ్యుడు ఏ. యాదగిరి పర్యవేక్షణలో ఈ శిబిరం కొనసాగుతుంది. తాజాగా బుధవారం గ్రామంలో నిర్వహించిన శిబిరంలో 171 మందికి కంటి పరీక్షలు చేశారు. లోపాలు ఉన్న వారికి 57 మందికి అద్దాలను పంపిణీ చేశారు. ఇంకా 78 మందికి సరిపోయే అద్దాలను పంపిణీ చేయాల్సి ఉంది.ఈ కార్యక్రమంలో ఆప్త మెట్రిక్ జయ ప్రకాశ్, ఆటో రిఫ్రక్టర్ కె.కళావతి, డాటా ఆపరేటర్ విమల్ కుమార్ స్తానిక ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

జూలపల్లి : మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన వచ్చింది. వైద్య సిబ్బంది బుధవారం 271 మందికి కంటి పరీక్షలు చేశారు. 42 మందికి ఆపరేషన్లు చేయించడానికి వైద్యులు గుర్తించారు. 32 మందికి అద్ధాలు అందజేశారు. 36 మందికి ప్రత్యేక అద్ధాలు తెప్పించడానికి రెఫర్ చేశారు. ఇక్కడ మండల వైద్యాధికారి జయప్రకాశ్, కంటి వైద్యుడు రత్నాకర్, సీహెచ్‌ఓ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

90
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...