అర్హులకు ఓటు హక్కు కల్పించాలి


Wed,September 12, 2018 02:12 AM

-18 ఏండ్లు నిండిన వారిని నమోదు చేయించాలి
-కలెక్టర్ శ్రీదేవసేన
కలెక్టరేట్ : 18 ఏండ్లు నిండి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకుంటూ కొత్త ఓటర్లను నమోదు చేయించాలని జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన పిలపునిచ్చారు. పెద్దపల్లి మండలంలోని బందంపల్లిలో గల స్వరూప గార్డెన్స్‌లో మంగళవారం ఓటరు జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదు, గ్రామాల పారిశుద్ధ్య అంశాలపై జిల్లాలోని రామగుండం, పెద్దపల్లి, మంథని నియోజకవర్గాల బూత్‌లెవల్ అధికారులు, సూపర్‌వైజర్లు, ప్రత్యేకాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అందుకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణ కోసం అధికారులంతా సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఎన్నికల నియమావళిని అనుసరించి విధులను నిష్పక్షపాతంగా నిర్వహించాలన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలని, పొరపాట్లు జరిగితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్‌ను ప్రకటించడం జరిగిందన్నారు. 2018 జనవరి 1 నాటికి 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలన్నారు. ఈ నెల 25 వరకు అభ్యంతరాలు స్వీకరించడం జరుగుతుందన్నారు. ఈ నెల 15, 16 తేదీల్లో రెండు రోజుల పాటు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి అభ్యంతరాలను స్వీకరించాలన్నారు. ఓటింగ్ వేసే ఈవీఎం యంత్రాలపై ప్రజలకు కొన్ని అపోహలున్నాయనీ, వాటిని తొలగించేందుకు ఈవీఎంలపై ప్రజలకు పూర్తి స్థాయి అవగాహన కల్పించాలన్నారు. ఈ నెల 19న జిల్లాకు 10 యంత్రాలు వస్తాయనీ, వాటి వినియోగంపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లాలోని గ్రామాలన్ని పరిశుభ్రంగా ఉండేలా ప్రత్యేకాధికారులంతా ప్రత్యేక శ్రద్ధతో పని చేయాలన్నారు. స్వచ్ఛ గ్రామాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పరిశుభ్రంగా ఉంచుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి డీఆర్వో కె. నర్సింహామూర్తి, జిల్లా ఇన్‌చార్జి డీఆర్డీఓ ప్రేమ్‌కుమార్, జిల్లా పంచాయతీ అధికారి వేముల సుదర్శన్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

99
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...