ఉపాధ్యాయుల సేవలు ప్రశంసనీయం


Wed,September 12, 2018 02:12 AM

పెద్దపల్లి, నమస్తే తెలంగాణ : ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయుల సేవలు ప్రశంసనీయమని తాజా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవంలో భాగంగా మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి ఎంపీపీ సందనవేని సునీత అధ్యక్షతన శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దాసరి మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులను క్రమశిక్షణతో రాబోయో తరాలకు అందించగల శక్తి కేవలం ఒక ఉపాధ్యాయుడికే ఉంటుందని కొనియాడారు. ప్రజలతో మమేకమై గ్రామాభివృద్ధికి కృషి చేసే వారిలో ఉపాధ్యాయులు ముందుంటారన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రాజు, జీసీడీఓ పద్మ, ఎంఈఓ సురేందర్‌కుమార్, హెచ్‌ఎం మురళీనాయక్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

111
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...