పోటీలు పట్టుదలను పెంచుతాయి


Wed,September 12, 2018 02:12 AM

-తాజా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి
పెద్దపల్లి, నమస్తే తెలంగాణ : గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వివిధ అంశాలపై చిత్రలేఖనం, వ్యాస రచన పోటీలు నిర్వహించడం వల్ల గెలువాలనే ఏకాగ్రతతో కూడిన పట్టుదల పెరుగుతుందని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి వివిధ పోటీలలో విద్యార్థులు తమ ప్రతిభను చాటి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను కైవసం చేసుకున్న విద్యార్థులకు దాసరి మనోహర్‌రెడ్డి ప్రశంస పత్రాలను అందజేశారు. జిల్లాస్థాయి స్వచ్ఛ పక్షోత్సవాలలో భాగంగా మంగళవారం ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయిలో స్వచ్ఛ పాఠశాల అనే అంశంపై డ్రాయింగ్ పోటీలు, ఉన్నత పాఠశాల స్థాయిలో స్వచ్ఛభారత్ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర అనే అంశంపై వ్యాస రచన పోటీలు, టాలెంట్ సెర్చ్ పరీక్షలను అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ట్రినిటీ డిగ్రీ కళాశాల ఆవరణలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. ప్రతి విద్యార్థి పరీక్షలలో పట్టదలతో చదివి విజయాలు సాధించాలని సూచించారు.

అనంతరం, సుల్తానాబాద్ మండలం గర్రెపెల్లి ఆదర్శ పాఠశాలకు చెందిన ఆకాష్, కనుకుంట్లకు చెందిన శ్రావణ్‌కుమార్, పెద్దపల్లి మండలం కనగర్తి పాఠశాలకు యెల్లంకి శుస్రిత, హన్మంతునిపేటకు చెందిన అజెయ్, ఓదెల మండలం కేజీబీవీ పాఠశాలకు చెందిన సింధూజ, వైష్ణవి, ముత్తారం మండలం పాఠశాలకు చెందిన ఆరిఫా, ధర్మారం మండలంకు చెందిన సాహిత్య, ఓడెడ్ గ్రామం పాఠశాలకు చెందిన వనజ, రామగుండం మండలంకు చెందిన సాయిరమ్యతో పాటు సుస్మిత, సాయిచరణ్, సంజనలకు ఎమ్మెల్యే ప్రశంస పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సందనవేని సునీత, ఎంఈఓ సురేందర్‌కుమార్, ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎం ప్రతాప్‌రెడ్డి, షేక్, రాంరెడ్డి, ఆగయ్య, హరిప్రసాద్ ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, ఎండీ హుస్సేన్, అశోక్, మొహినోద్ధిన్, మొయిన్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

112
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...