వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి


Wed,September 12, 2018 02:12 AM

పెద్దపల్లి టౌన్ : పెద్దపల్లి మున్సిపాల్టీ పరిధిలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్యాధికారి ప్రమోద్‌కుమార్ సూచించారు. పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అమర్‌నగర్, ఫారన్‌స్ట్రీట్‌లలో మంగళవారం ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ ప్రమోద్‌కుమార్ శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. మున్సిపల్ చైర్మన్ ఎలువాక రాజయ్య కోరిక మేరకు పట్టణంలో వారం రోజులుగా వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజల నుంచి మంచి స్పందన కన్పిస్తున్నదని పేర్కొన్నారు. పట్టణంలో తీవ్రంగా జ్వరాలు వస్తున్న నేపథ్యంలో అందుబాటులోకి వచ్చిన వైద్యాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలన్నారు. 287 మంది స్థానికులకు వైద్యపరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇక్కడ డాక్టర్ ఫణీందర్, హెచ్‌ఈఓ బుచ్చిరెడ్డి, హెచ్‌ఎస్ జగన్, శైలజ, స్కైలాభ్‌రాణి, సంతోష, ఏఎన్‌ఎం, ఆశాలు పాల్గొన్నారు.

107
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...