దాసరికి పెరుగుతున్న మద్దతు


Wed,September 12, 2018 02:12 AM

కలెక్టరేట్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ రద్దు అనంతరం త్వరలో జరుగబోయే ఎన్నికలకు పెద్దపల్లి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో, దాసరికి రోజు రోజుకు ప్రజల మద్దతు పెరుగుతుంది. జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయం అభిమానులు, కార్యకర్తల రాకతో సందడిగా తయారైంది. క్యాంపు కార్యాలయంలో మంగళవారం దాసరి మనోహర్‌రెడ్డిని నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన మహిళా సంఘాల నాయకులు, యువకులు, టీఆర్‌ఎస్ కార్యకర్తలు కలిసి పుష్ఫగుచ్ఛం అందించి సత్కరించారు. మహిళలు దాసరికి బొట్టుపెట్టి ఆశీర్వదిస్తూ శాలువాలతో సన్మానించారు. ఇక్కడ దామ సదయ్య, పందిళ్ల లక్ష్మణ్, తలారి సాగర్, రమేశ్, సతీశ్, శ్రీనివాస్, మల్లేశ్, రాములు, పద్మ, రాజేశ్వరి, సునీత పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు.

135
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...