మంథనిలో చరిత్ర సృష్టిస్తాం..


Wed,September 12, 2018 02:11 AM

-టీఆర్‌ఎస్ అంటేనే ప్రజల పార్టీ..
-తాజా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు
-మంథనిలో మరోమారు ఎగురనున్న గులాబీ జెండా
-టీఆర్‌ఎస్ మూడు నియోజకవర్గాల ఇన్‌చార్జి కర్ర శ్రీహరి
-పుట్ట మధు ప్రచారానికి ప్రజల బ్రహ్మరథం
మంథని, నమస్తే తెలంగాణ: మంథని నియోజకవర్గ చరిత్రలోనే అత్యధిక మెజార్టీ సాధించి చరిత్ర లిఖిస్తామని మంథని నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం మంథని పట్టణంలోని మర్రివాడలో ఆయన టీఆర్‌ఎస్ మంథని, పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాల ఇన్‌చార్జి కర్ర శ్రీహరితో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు ఆయనకు అడుగడుగునా బ్రహ్మరథం పలికారు. మంథని పురపాలక సంఘం నుంచి ఫైర్ స్టేషన్ వరకూ ఇంటింటికీ తిరిగి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఓటర్లు పుట్ట మధుకు తిలకందిద్ది మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్టే ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ వందసీట్లు సాధిస్తుందని అన్నారు. ప్రతిపక్షాల నాయకులు గెలుపు కోసం కాకుండా డిపాజిట్ గల్లంతుకాకుండా చూసుకోవాలని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మరోమారు ప్రజల్లోకి వెళ్తున్న తనకు ప్రజల ఆదరణ చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ ఎన్నికల్లో నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎవ్వరూ సాధించనంత మెజార్టీని తాము సాధిస్తామన్నారు. చిత్త శుద్ధితో పనిచేసి దశాబ్దాల కాలంగా పరిష్కారం కాని అనేక సమస్యలను పరిష్కరించామన్నారు.

మరోమారు గులాబీ జెండానే..
మంథని నియోజకవర్గంపై మరోమారు గులాబీ జెండా ఎగరనున్నదని, నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు తోడు మచ్చలేని నాయకుడు పుట్ట మధుకు అవకావం ఇవ్వడం ద్వారా భారీ మెజార్టీతో విజయం సాధిస్తామనే పూర్తి నమ్మకం ఉందని టీఆర్‌ఎస్ పార్టీ మంథని, పెద్దపల్లి, రామగుండం మూడు నియోజకవర్గాల ఇన్‌చార్జ్ కర్ర శ్రీహరి అన్నారు. జిల్లాలోనే మంథని నియోజవకర్గంలో టీఆర్‌ఎస్ అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మంథని ఎంపీపీ ఏగోళపు కమల, వైస్ ఎంపీపీ వేల్పుల గట్టయ్య, మంథని, రామగిరి మండలాల టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు కొండా శంకర్, పూదరి సత్యనారాయణ, పట్టణ శాఖ అధ్యక్షుడు ఆరెపల్లి కుమార్, రూరల్ అధ్యక్షుడు నక్క సమ్మయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆకుల కిరణ్, జిల్లా రైతు సమన్వయ కమిటీ సభ్యుడు ఏగోళపు శంకర్‌గౌడ్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు ఖలీల్‌ఖాన్, నాయకులు తగరం శంకర్‌లాల్, బైర్నేని సందీప్‌రావు, పుల్లెల కిరణ్, ఆసిఫ్, బెజ్జంకి డిగంభర్‌తో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

123
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...