అభివృద్ధిని వివరించండి


Wed,September 12, 2018 02:11 AM

-నాలుగేళ్లలో చేసిన పనులు చెప్పండి
-ముఖ్యకార్యకర్తల సమావేశంలో తాజా మాజీ ఎమ్మెల్యే దాసరి
కలెక్టరేట్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి గ్రామాల్లో జరిగిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ఇంటింటికీ వెళ్లి వివరిస్తూ మళ్లీ టీఆర్‌ఎస్‌ను అధికారంలోకి తెచ్చే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ముఖ్య కార్యకర్తలు, ఎంపీటీసీలు, తాజా మాజీ సర్పంచులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ.. గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిగాయని, వాటన్నింటిని కూడా ప్రజలకు కళ్లకు కట్టినట్లు వివరించాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో గ్రామంలో రూ. 2కోట్ల నుంచి రూ. 4కోట్ల వరకు వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, వాటన్నింటిని కూడా వివరించి చెప్పాలన్నారు. తెలంగాణ ప్రజల ఇంటి పార్టీగా భావిస్తున్న టీఆర్‌ఎస్ పార్టీకి అండగా నిలబడి మళ్లీ అధికా రంలోకి వచ్చేలా కృషి చేయాలని కోరారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు మర్కు లక్ష్మణ్, సింగిల్ విండో చైర్మన్ ముద్దసాని రాజిరెడ్డి, వైస్ ఎంపీపీ దాసరి చంద్రారెడ్డి, నాయకులు సందనవేని రాజేందర్ యాదవ్, తీగల ధర్మపురి, మేకల లక్ష్మణ్ యాదవ్, బండారి రామ్మూర్తి, కీర్తి రాజయ్య, అర్కుటి రామస్వామి యాదవ్, సలేంద్ర రాజయ్య యాదవ్, మామిడి ఓదెలు, మాదిరెడ్డి తిరుపతిరెడ్డి, నర్సింహారెడ్డి, వైద శ్రీనివాస్, ఆవుల రాజకిషన్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...