చెమన్‌కు అరుదైన గౌరవం


Wed,September 12, 2018 02:11 AM

జూలపల్లి: కుమ్మరికుంట గ్రామానికి చెందిన ప్రముఖ కవి, రచయిత డాక్టర్ చెమన్‌సింగ్‌కు జర్మనీకి చెందిన ఇంటర్నేషనల్ పీస్ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. ధీర్ఘకాలిక వ్యాధుల్లో ప్రత్యామ్నాయ వైద్య విధానాలు అమలు చేస్తూ, అతను వైద్య రంగానికి చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ గౌరవ డాక్టరేట్‌కు ఎంపికయ్యారు. ఈనెల 15న పాండిచ్చేరిలో నిర్వహిస్తున్న యూనివర్సిటీ స్నాతకోత్సవ వేడుకల్లో చెమన్‌కు పీహెచ్‌డీ ప్రదానం చేయనున్నారు. సదస్సుకు జపాన్, థాయ్‌లాండ్, టిబెట్, జర్మనీ తదితర దేశాల నుంచి ప్రముఖులు హాజరుకానున్నారు. ఇక్కడ ఆయన భారత దేశానికి ప్రత్యామ్నాయ వైద్యవిధానం అవసరం అనే అంశంపై ప్రసంగించనున్నారు. ధీర్ఘకాలిక వ్యాధులను నయం చేయడంలో విభిన్నంగా కృషి చేస్తున్నారు. ప్రత్యామ్నాయ వైద్య విధానాలు ఎలా ఉపయోగపడుతున్నాయో పలు వైద్యసదస్సుల్లో చెమన్ వివరించారు. ఆయన పలు వైద్య వ్యాసాలు రాశారు. రెండుసార్లు ఉత్తమ వైద్యుడిగా అవార్డులు కూడా అందుకున్నారు.

96
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...