రామగుండం కమిషనరేట్‌కు ముగ్గురు ఏసీపీలు


Wed,September 12, 2018 02:10 AM

ఫెర్టిలైజర్‌సిటీ: హైదరాబాద్ నగరంలో ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తూ ఇటీవల పదోన్నతి పొందిన 1995 బ్యాచ్‌కు చెందిన ముగ్గురు ఏసీపీలను రామగుండం పోలీస్ కమిషనరేట్‌కు కేటాయిస్తూ రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో ఎస్ సీసీఎస్ రామగుండం ఏసీపీగాను, సీహెచ్ శ్రీధర్‌ను టాస్క్‌ఫోర్స్ రామగుండం ఏసీపీగా, వై ట్రాఫిక్ ఏసీపీగానూ బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో వీరు బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా, గతంలో టాస్క్‌ఫోర్స్ ఏసీపీగా పని చేసిన విజయసారథి, ములుగు డీఎస్పీగా బదిలీ కాగా సీసీఎస్ ఏసీపీగా పని చేసిన చంద్రయ్య ఈనెల 4న వరంగల్ సిటీ పోలీస్ కమిషనర్ పరిధిలోని వెస్ట్ ఏసీపీగా బదిలీ అయ్యారు. ట్రాఫిక్ ఏసీపీగా పని చేసిన వెంకటరమణ ఈనెల 6న జరిగిన బదిలీల్లో జగిత్యాల డీఎస్పీగా బదిలీ అయ్యారు. దీనితో ఖాళీగా ఉన్న ఆయా స్థానాల్లో నూతన ఏసీపీని నియమిస్తూ డీజీపీ మహేందర్‌రె డ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

109
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...