నవరాత్రోత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి


Wed,September 12, 2018 02:10 AM

-ఎస్‌ఐ చంద్రకుమార్
ఓదెల : గణేశ్ నవరాత్రి ఉత్సవాలను గ్రామాల్లో ప్రజలు శాంతియుతంగా జరుపుకోవాలని పొత్కపల్లి ఎస్‌ఐ చంద్రకుమార్ కోరారు. కొత్తగా పొత్కపల్లి ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టిన చంద్రకుమార్ మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పండుగలను మతసామరస్యానికి ప్రతికగా జరుపుకోవాలన్నారు. వినాయక మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా మండప నిర్వహకులు చూసుకోవాలని కోరారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలందరు సహకరించాల్సిందిగా కోరారు. అనంతరం, ఆయన్ను టీఆర్‌ఎస్ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎస్‌ఐని కలిసిన వారిలో టీఆర్‌ఎస్ నాయకులు మ్యాడగోని శ్రీకాంత్‌గౌడ్, చర్లపల్లి సురేశ్‌గౌడ్, గోవిందుల ఎల్లస్వామి, కుమార్, శ్రీధర్, రాజు తదితరులు ఉన్నారు.

90
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...