లారీ కిందపడి కార్మికుడి మృతి


Wed,September 12, 2018 02:10 AM

ధర్మారం : మండలంలోని బంజేరుపల్లి గ్రామ శివారులోని 7వ ప్యాకేజీ అండర్ టన్నెల్‌లో మంగళవారం ఉదయం జరిగిన ప్రమాదంలో అస్సాం రాష్ర్టానికి చెందిన నెగోన నర్జరి(25) అనే కార్మికుడు మృతి చెందాడు. స్థానిక ఏఎస్‌ఐ మార్కొండ కిషన్ కథనం ప్రకారం.. టన్నెల్‌లో నర్జరి కాంక్రీట్ మిక్చర్‌లోడ్‌ను అన్‌లోడ్ చేసిన అనంతరం లారీకి ఉన్న ట్యాప్ విప్పి నీటితో చేతులు శుభ్రం చేసుకుంటున్నాడు. ఆ సమయంలో లారీ డ్రైవర్ సదరు వ్యక్తిని గమనించకుండా అకస్మాత్తుగా స్టార్ట్ చేయగా వాహనం ముందుకు వెళ్లడంతో, దానికి కింద పడ్డ నర్జరి అక్కడికక్కడే మృతి చెందినట్లు ఏఎస్‌ఐ కిషన్ తెలిపారు. సంఘటనా స్థలాన్ని వద్దకు పరిశీలించి శవ పంచనామా చేసి మృతిడి బంధువు రాబిన్ బ్రహ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

108
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...