ఉప్పెనలా..


Tue,September 11, 2018 01:14 AM

కలెక్టరేట్ : ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌లోకి చేరికలు జోరందుకున్నాయి. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఉద్యమ సమయంలో ఏ విధంగానైతే పోరాట పఠిమతో ముందుకు సాగినట్టే, తెలంగాణ బిడ్డలంతా ఇంటి పార్టీ టీఆర్‌ఎస్‌తో కలిసి రావాలని తాజా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం నియోజకవర్గంలోని కాల్వశ్రీరాంపూర్ నుంచి జూకంటి అనిల్ ఆధ్వర్యంలో 50 మంది, ఎలిగేడు మండలం ర్యాకల్‌దేవుపల్లి నుంచి మడ్లపల్లి నారాయణ ఆధ్వర్యంలో 50 మంది, పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని తిలక్‌నగర్ 8, 9, 12 వార్డులకు చెందిన గౌడ, రజక సంఘం సభ్యులతో పాటు పెద్దపల్లి మండలం నిమ్మనపల్లికి చెందిన 100 మంది టీఆర్‌ఎస్‌లో చేరగా, వారికి కండువాలు కప్పిన దాసరి మనోహర్‌రెడ్డి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా దాసరి మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రం ఆవిర్భవించి తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన నాలుగేళ్లలో జరిగిన అభివృద్ధి సంక్షేమాలను దృష్టిలో పెట్టుకుని చిన్నా పెద్దా తేడా లేకుండా పార్టీలకతీతంగా టీఆర్‌ఎస్‌లో భారీగా చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారన్నారు.

ప్రతిపక్ష పార్టీలు 60 ఏండ్లలో చేయని అభివృద్ధిని నాలుగేళ్లలో చేసి చూపించామనీ, ఆ ప్రగతిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. గ్లోబల్ ప్రచారంతో కాంగ్రెస్ పార్టీ నేతలు అధికారం కోసం ఆరాటపడుతూ ఓట్ల కోసం గ్రామాల బాట పడుతున్నారనీ, వారి మాటలు ప్రజలు నమ్మేస్థితిలో లేరన్నారు. కార్యక్రమంలో కాల్వశ్రీరాంపూర్ మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్ నిదానపురం దేవయ్య, సుల్తానాబాద్, ఎలిగేడు టీఆర్‌ఎస్ మండలాధ్యక్షులు బాలాజీరావు, తానిపర్తి మోహన్‌రావు, టీఆర్‌ఎస్‌వీ జిల్లా కో-ఆర్డినేటర్ కొయ్యడ సతీశ్‌గౌడ్, పెద్దపల్లి వైస్ ఎంపీపీ దాసరి చంద్రారెడ్డి, నాయకులు దాసరి వెంకటరమణారెడ్డి, కీర్తి రాజయ్య, ఒడ్నాల శ్రీనివాస్, లింగమూర్తి, మొగిలి, ఆషాడపు పోచాలు, సతీశ్, రవి, గోపు శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్, చిన్న వెంకన్న, రాజిరెడ్డి, కొమురయ్య, భూమయ్య, అంజయ్య, అనిల్, తిర్రి రఘు, రేగుంట దినేశ్‌గౌడ్, రాజమౌళి, శ్రీకాంత్, బాలయ్య, మొగిలి, ముత్తునూరు స్వామి, తూముల శ్రీనివాస్, వేల్ఫుల రమేశ్, వేల్ఫుల కుమార్, ముక్కెర కొమురయ్య, చెక్కల అంజయ్య, వేల్ఫుల నర్సింగం, అట్ల కుమార్, తదితరులు పాల్గొన్నారు.

శుభాకాంక్షల వెల్లువ..
పెద్దపల్లి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా దాసరి మనోహర్‌రెడ్డిని ప్రకటించడంతో నాలుగు రోజులుగా జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, అభిమానుల రాకతో సందడిగా మారింది. ఈ క్రమంలో నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, వ్యాపారులు, రైస్‌మిల్లర్ల సంఘం, వివిధ కుల సంఘాల నాయకులు, ముస్లీం మైనార్టీలు, యువకులు తాజా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డిని కలిసి పుష్ఫగుచ్ఛాలు అందించి, పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. కాగా ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన పెద్దపల్లి మండలం పెద్దకల్వలకు టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు సలేంద్ర కొమురయ్య యాదవ్ ఇంటికి వెళ్లి పరామర్శించగా, కొమురయ్యతో పాటు గ్రామస్తులు దాసరి మనోహర్‌రెడ్డికి పుష్ఫగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్ గుండేటి ఐలయ్య యాదవ్, నాయకులు మాదారపు ఆంజనేయరావు, దాసరి వెంకటరమణారెడ్డి, దాసరి చంద్రారెడ్డి, ముత్తునూరు స్వామి, ఎడవెల్లి రాంరెడ్డి, ముస్త్యాల రాజన్న, చంద్రారెడ్డి ఉన్నారు. అలాగే, కాల్వశ్రీరాంపూర్ రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు నిదానపురం దేవయ్య ఆధ్వర్యంలో పలువురు నాయకులు దాసరిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పెద్దపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించుకుంటామని వారు ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ నాయకులు ఒడ్నాల శ్రీనివాస్, తిప్పనవేన కొమురయ్య, తొట్ల రవి, జూకంటి అనిల్, రవి ఉన్నారు.

100
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...