పోషణ చట్టంపై అవగాహన కల్పించాలి


Tue,September 11, 2018 01:14 AM

కలెక్టరేట్ : తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టం-2007 నియమావళిపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని, ఇంటింటా పోషణ సంబురాలను విజయవంతం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం తల్లిదండ్రుల పోషణ చట్టం, ఇంటింటా పోషణ సంబురాలు, వీఆర్వో పరీక్షల నిర్వహణపై వేర్వేరుగా సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇంటింటా పోషణ సంబురాల పోస్టర్‌ను ఆవిష్కరించి, పోషణ్ అభియాన్‌పై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పౌష్టికాహార లోపాలను గుర్తించి ఎనీమియా వ్యాధులను తొలగించడానికి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. ఇందుకోసం సెప్టెంబర్ మాసంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. పోషణకు దూరమైన తల్లిదండ్రులు పోలీసులు, తహసీల్దార్లకు దరఖాస్తు చేసుకుంటే ఫ్యామిలీ కౌన్సెలింగ్ చేసే అవకాశం ఉందన్నారు. అలాగే, జిల్లాలో ఈ నెల 16 జరగనున్న వీఆర్వో పరీక్షలకు పక్బందీ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 22,362 మంది అభ్యర్థులు వీఆర్వో పరీక్షలకు హాజరుకానున్నారనీ,

అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలనీ, రవాణా సౌకర్యం కోసం ప్రత్యేకంగా బస్సులు నడిపించాలనీ, సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్షల కోసం జిల్లాలో 55 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామనీ, వీటికి 13 రూట్ల ద్వారా పరీక్షా కేంద్రాలకు చేరుకోవచ్చన్నారు. పరీక్ష కేంద్రాల్లో మంచినీటి వసతితో పాటు పరీక్షల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని నియమించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి డీఆర్డీఓ ప్రేమ్‌కుమార్, జిల్లా ఇన్‌చార్జి సంక్షేమశాఖ, జిల్లా సహకార అధికారి చంద్రప్రకాశ్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి వేముల సుదర్శన్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ప్రమోద్‌కుమార్, జిల్లా వ్యవసాయాధికారి తిరుమల్ ప్రసాద్, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ శ్రీనివాస్, జిల్లా కోశాధికారి సత్యకుమార్, డీఏఓ నాగరాజన్న, ఏసీజీ ఈఓ టి. వెంకటేశ్వర్లు, ఆర్టీసీ ప్రతినిధి రమణ, పెద్దపల్లి డీసీపీ సుదర్శన్‌గౌడ్, ఏసీపీ హబీబ్‌ఖాన్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా లీగల్ సెల్ సభ్యుడు కాంపెల్లి నారాయణతో పాటు జిల్లా అధికారులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

116
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...