టీఆర్‌ఎస్‌కే జై..


Mon,September 10, 2018 03:03 AM

-సిట్టింగులకే టికెట్లతో అన్నివర్గాల మద్దతు
-రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణ
-పెద్ద సంఖ్యలో తరలిస్తూ అభినందలు
-స్థానిక క్యాడర్‌లోనూ ఫుల్ జోష్
-క్షేత్రస్థాయి ప్రచారానికి ఏర్పాట్లు
-వాడవాడనా విస్తృత పర్యటన
పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: శాసనసభ రద్దు చేసి, ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ అభ్యర్థులను ప్రకటించడంతో జిల్లాలోని అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు వస్తున్నది. పెద్దపల్లిలోని పెద్దపల్లి, రామగుండం, మంథని నియోజకవర్గాలతో పాటు ధర్మపురి నియోజకవర్గం టికెట్లు ఖరారు కావడంతో టీఆర్‌ఎస్ అభ్యర్థులకు జిల్లాలో అన్నివర్గాల నుంచి ఆదరణ పెరుగుతున్నది.

దాసరికి పెరుగుతున్న మద్దతు..
జిల్లాలోని పెద్దపల్లి టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి పేరు ఖరారుకావడంతో నియోజకవర్గ ప్రజలు అంబరాన్నంటేలా సంబురాలు చేసుకున్నారు. ఇటీవలే హైదరాబాద్ నుంచి నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా ఘనస్వాగతం పలికి, భారీ ర్యాలీ తీశారు. మరుసటి రోజు నుంచి నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు, వివిధ కుల సంఘాల నాయకులు, వ్యాపారవేత్తలు తరలివచ్చి దాసరిని అభినందనల్లో ముంచెత్తారు. మా ఓటు మీకేనంటూ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో మనోహర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని పేర్కొన్నారు. ఇటు టీఆర్‌ఎస్ పార్టీ నాలుగేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీని గెలిపించడమే లక్ష్యంగా వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, పలు గ్రామాల యువకులు పెద్ద సంఖ్యలో ఆదివారం దాసరి సమక్షంలో చేరారు.

మధు ఎన్నికల శంఖారావం..
మరో వైపు టీఆర్‌ఎస్ మంథని శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా మంథని తాజా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు పేరును ప్రకటించడంతో శనివారం హైదరాబాద్ నుంచి మంథనికి వచ్చిన మధును తొమ్మిది మండలాల నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. గ్రామ గ్రామాన మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకగా, యువత బైక్ ర్యాలీలు తీసి అభిమాన నేతకు అడుగడునా నీరాజనం పలికారు. ఈ క్రమంలో ఇప్పటికే జోష్‌మీదున్న స్థానిక క్యాడర్‌తో కలిసి ఆదివారమే పుట్ట మధు ఎన్నికల ప్రచారంలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీ అంతమే లక్ష్యంగా, వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను, తనను గెలిపించాలని నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాగా, అంతకుముందు మంథనిలోని తన నివాసం వద్ద జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గూడూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన 100 మంది మహిళలు తాజా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.

సత్యనారాయణకు మద్దతుగా..
టీఆర్‌ఎస్ రామగుండం అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణకు మద్దతుగా అప్పుడే స్థానిక నేతలు, నాయకులు ప్రచారంలోకి దిగారు. ఇప్పటికే ఇప్పటికే నియోజకవర్గంలోని పలువురు నాయకులతో మాట్లాడిన సోమారపు వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. కాగా, టీఆర్‌ఎస్‌కు మద్దతుగా టీజీబీకేఎస్ నాయకులు ఇప్పటికే బొగ్గు బావులపై ప్రచారం ప్రారంభించారు. సింగరేణి కార్మికులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్నారు.

కొప్పులకు శుభాకాంక్షల వెల్లువ..
జిల్లాలోనే పరిధిలోకి కొంత భాగం వచ్చే, జగిత్యాల జిల్లాలోని ధర్మపురి శాసనసభ స్థానానికి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ పేరును ఖరారు చేయడంపై నాయకుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. అన్నివర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తున్నది. వరుసగా ఆరో సారి టీఆర్‌ఎస్ టికెట్ ఈశ్వర్‌కు కేటాయించడం పట్ల ధర్మారం మండలంలో కొప్పుల మద్దతు దారులు సంబురాలు జరుపుకున్నారు. మరో వైపు వచ్చే ఎన్నికల్లో భారీ మోజార్టీతో ధర్మపురి స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ఈశ్వర్ ప్రణాళిక సిద్దం చేశారు. కమాన్‌పూర్ మండల కేంద్రంలోని ఆదివరాహ స్వామి ఆలయంలో ఈశ్వర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే విజయమ ని విశ్వాసం ప్రకటించారు. ఇదిలా ఉండగా, ఆదివా రం కొప్పుల సమక్షంలో బీజేపీ, కాంగ్రెస్ నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు.

రవీంద్రాచారికి సన్మానం
ఓదెల : నవ్యాంధ్ర రచయితల సంఘం ఆవిర్భావ వేడుకల సందర్భంగా విజయవాడలో నిర్వహించిన 300 కవితల పండుగ కార్యక్రమంలో ఓదెలకు చెందిన యువ రచయిత బ్రహ్మాండ్లపల్లి రవీంద్రాచారికి సన్మానం జరిగింది. ఈ నెల 8, 9 తేదీల్లో ఆవిర్భావ వేడుకలు జరిగినట్లు జరుగగా, అందులో ఆంధ్రా అందాలు చూడు అనే కవిత చదవగా నవ్యాంధ్ర రచయితల సంఘం అధ్యక్షుడు బిక్కి కృష్ణ ప్రశంసి రవీంద్రాచారిని సన్మానించారు. సమావేశంలో తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు నాళేశ్వరం శంకరం, సినీ డైరెక్టర్ ప్రభాకర్ జైనీ, కలిమిశ్రీ తదితరులు పాల్గొన్నారు.

129
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...