సోమారపు గెలుపునకు కృషి చేస్తాం..


Mon,September 10, 2018 03:01 AM

-ఎస్సీలను ఐక్యం చేస్తాం
-టీఆర్‌ఎస్ ఎస్సీ సెల్ నాయకులు
గోదావరిఖని,నమస్తే తెలంగాణ: రామగుండం అసెంబ్లీ స్థానానికి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా టికెట్ దక్కించుకున్న సోమారపు సత్యనారాయణను మరోసారి గెలిపించడానికి కృషి చేస్తామనీ, ఇందుకు నియోజకవర్గంలోని ఎస్సీలను ఐక్యం చేస్తామని టీఆర్‌ఎస్ ఎస్సీ సెల్ నాయకులు మొలుగూరి వీరయ్య, కోదాటి ప్రవీణ్‌కుమార్ రామగుండంలో అనేక సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతోన్న సోమారపు సత్యనారాయణకు అన్ని వర్గాల వారు అండగా ఉండి మరోసారి గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ఎస్సీ వర్గానికి చెందిన వారందరూ ఐక్యంగా టీఆర్‌ఎస్‌కు ఓటు వేసే విధంగా కృషి చేస్తామని, ఈసారి సోమారపును అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ఈ సందర్భంగా నొక్కిచెప్పారు. సింగరేణి కార్మికులకు అనేక ఆర్థిక ప్రయోజనాలు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని త్వరలోనే కా ర్యచరణ రూపొందించి ప్రచార కార్యక్రమాన్ని ఉధృ తం చేస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో ఎస్సీ సెల్ కో-ఆర్డినేటర్ నీరటి శ్రీనివాస్‌తో పాటు 100 మంది నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే 33వ డివిజన్‌లో మేరుగు నరేశ్ ఆధ్వర్యంలో జరిగిన ఆశీర్వాద సభలో టీఆర్‌ఎస్‌వై నాయకులు సోమారపు అరుణ్ హాజరై మాట్లాడారు. టీఆర్‌ఎస్ అధిష్టానం సూచన మేరకు ప్రతి కార్యకర్త నడుచుకోవాలని సూచించారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కోదాటి ప్రవీణ్, బాలసాని తిరుపతి, రత్నాకర్, చంద్రమౌళి, నర్సయ్య, వెంకటస్వామి, సంపత్, కనకయ్య పాల్గొన్నారు.

160
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...