వైభవంగా పొలాల అమావాస్య


Mon,September 10, 2018 03:01 AM

జ్యోతినగర్: పొలాల అమావాస్యను పురస్కరించుకొని ఎన్టీపీసీ టౌన్‌షిప్‌లోని అభయంజనేయస్వామి ఆలయంలో ఆదివారం గోమాత పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళవాయిద్యాలు, వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛరణల మధ్య గోమాత సర్వాంగాలకు పసుపు, కుంకుమ పూసి, పూలమాలలు, నూతన వస్ర్తాల అలంకరణతో పూజలు చేశారు. ముందుగా మహిళలు ఆలయంలోకి వస్తున్న గోమాతకు మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. అనంతరం భక్తులందరికీ అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు. పూజా కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకుడు రుద్రబట్ల శ్రీకాంత్ శర్మ, వేద బ్రాహ్మణులు రాంపెల్లి వామన్‌శర్మ, సుధీర్ శర్మ, రాజేశ్ శర్మ, సంతోష్ శర్మ, రామాచారి శర్మలు నిర్వహించగా కార్యక్రమానికి అతిథులుగా ఏసీపీ రక్షిత కే మూర్తి, ఎన్టీపీసీ జీఎంలు ఏకే జైన్, రమేశ్, కార్పొరేటర్లు కొలిపాక సుజాత, కవిత పూజ పాల్గొని పూజలు చేశారు. అనంతరం అర్చకులు ఆవులకు వెండి కొమ్ములు, పాదాలకు వెండి డెక్కలు, నూతన వస్ర్తాలను సమర్పించారు. అనంతరం ఆవుదూడల మహా కథలను భక్తులను వినిపించారు. ముందుగా అతిథులకు అర్చకులు పూర్ణ కలుషితంతో స్వాగతం పలికారు. పూజా కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఆనందరావు, చెప్యాల శ్రీపతిరావు, రామారావు, తదితరులతోపాటు మహిళా భక్తులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.

114
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...