సంస్కృతిని కాపాడుకుందాం


Mon,September 10, 2018 03:01 AM

-తాజామాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి
పెద్దపల్లి, నమస్తే తెలంగాణ : తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ సంస్కృతిని కాపాడుకోవాలని తాజా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పిలుపునిచ్చారు. పెద్దపల్లి మండలం రంగాపూర్ ఎస్సీ కాలనీ వాసులు ఆదివారం సాయంత్రం పోశమ్మ భోనాల పండుగ జరుపుకున్నారు. ఈ సందర్భంగా హాజరైన తాజా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ, గ్రామీణ ప్రజల అభివృద్ధి ధ్వేయంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు తమ చరిత్రను, సాంస్కృతిని కాపాడుకుంటూ ఆర్థికాభివృద్దికి పాటు పడాలని, రాబోయో ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించుకోవాలన్నారు. ముందుగా గ్రామంలోని 25 మంది డప్పు కళాకారులకు కొత్త డప్పులను మనోహర్‌రెడ్డి అందజేశారు. అనంతరం దళితులతో పాటు పోశమ్మ బోనం తలపై పెట్టుకుని ఆలయం వరకు ఆయన వెళ్లి మొక్కులను చెల్లించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్వీ జిల్లా కన్వీనర్ కొయ్యడ సతీశ్‌గౌడ్, ఎంపీటీసీ గంట సరిత, మాజీ సర్పంచ్ గంట లావణ్య, టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు గంట రమేశ్, కలబోయిన రవి, మహేందర్, కుమార్, వెంకన్న, సదయ్య, వంశీ, మధు తదితరులు పాల్గొన్నారు.

95
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...