కాళోజీ సేవలు చిరస్మరణీయం..


Mon,September 10, 2018 03:00 AM

కలెక్టరేట్ : ప్రజా కవి కాళోజీ నారాయణ రావు సేవలు చిరస్మరణీయమనీ, ఆయన రచనలతో సమాజాన్ని జాగృతం చేసిన మహానీయుడని ఇన్‌చార్జి డీఆర్వో కె.నర్సింహమూర్తి పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో ఆదివారం తెలుగు భాషాదినోత్సవాన్ని పరస్కరించుకుని కాళోజీ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కాళోజీ రచనలు తెలంగాణ యాసను ప్రతిభింబిస్తూ సమాజ హితంకోసం ఎంతగానో దోహదంచేశాయన్నారు. ఆయన ఆశయ సాధన కోసం కవులు కళాకారులు, కృషి చేస్తూ భవిష్యత్ తరాలకు మహనీయుల చరిత్రను తెలిసేలా చేయాలన్న ఉధేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం మేధావుల జయంతి, వర్ధంతి కార్యాక్రమాలను అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. కార్యక్రమంలో భవానిప్రసాద్, రాజేశ్వర్‌రావు, శ్రీనివాస్, లక్ష్మణ్ తదితరులున్నారు.

99
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...