నెరవేరిన దశాబ్దాల కల


Mon,September 10, 2018 03:00 AM

-భట్టుపల్లి మర్రివాగు ప్రాజెక్టుకు మోక్షం
-ఇటీవలే ఉత్తర్వులు ..
-తాజా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు
మంథని, నమస్తే తెలంగాణ: మంథని మండలం భట్టుపల్లి గ్రామ శివారులో 1976లో ప్రతిపాదనలు చేసిన మర్రివాగు ప్రాజెక్టును నిర్మించి మండలంలో ని బీడు భూములను సస్యశ్యామలం చేస్తామని తా జా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అన్నారు. ఆదివా రం మంథని పట్టణంలోని అంబేద్కర్ చౌక్‌లో తె లంగాణ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణానికి ఈనెల 6న విడుదల చేసిన ఈఓ ఆర్టీ నెం 1092ని మీడియాకు చూపించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. 1976వ సంవత్సరంలో అప్పటి పాలకులు, అధికారులు మంథని మండలంలోని ఖాన్‌సాయిపేట, భట్టుపల్లి, వెంకటాపూర్, అడవి సోమన్‌పల్లి, ఆరెంద గ్రామాల్లోని బీడు భూములను సాగు భూములుగా మలిచేందుకు ప్రాజెక్టు నిర్మాణా నికి ప్రతిపాదనలు చేశారని తెలిపారు. అప్పటి నుం చి జరిగిన ప్రతీ ఎన్నికల్లో ప్రాజెక్టు నిర్మిస్తామని పాలకులు ఇచ్చిన హామీని హామీగానే ఉంచారే తప్ప దాని నిర్మాణానికి ఏ మాత్రం ప్రయత్నం చేయలేదని విమర్శించారు. దీంతో దశాబ్ధాలకాలంగా మర్రివాగు ప్రాజెక్టు మంథని నియోజకవర్గంలో ఎన్నికల హామీగానే మిగిలిపోయిందన్నారు. మాజీ స్పీకర్ శ్రీపాదరావు, మాజీ మంత్రి శ్రీధర్‌బాబులు చెరో 15ఏళ్లు అధికారంలో ఉండి ఎప్పుడూ మర్రివాగును పూర్తి చేస్తామని చెప్పారే తప్ప వాటి అనుమతుల కోసం ప్రయత్నించలేదని మండిపడ్డారు.

ప్రాజెక్టును నిర్మిస్తే బీడు భూములు సస్యశ్యామలవు తాయని, ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన బిడ్డగా, కష్టాలు ఎరిగిన ప్రభుత్వంగా తాము నాలుగున్నరేళ్లుగా ఈ ప్రాజెక్టు అనుమతుల కోసం ప్రయత్నించామని వివరించారు. 1972లో ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదన చేస్తే 1990లో ప్రాజెక్టు నిర్మాణానికి మంజూరు లభించిందన్నారు. అప్పటి నుంచి 2014వరకు అటవీశాఖ అనుమతులు లేక ఆగిపోతే కనీసం దానిగురించి పట్టించుకోలేదన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అనేక సమస్యల సుడిగుండంలో ఉన్న మర్రివాగు ప్రాజెక్టు అనుమతుల కోసం శ్రీకారం చుట్టి అనేక సర్వేలు చేయించి ప్రాజెక్టు నిర్మించడం ద్వారా అటవీశాఖ కోల్పోయే భూమికి బదులు భూమితో పాటుగా చెట్ల పెంపకానికి అవసరమయ్యే ఖర్చుల కోసం తెలంగాణ ప్రభుత్వం స్టేజ్-2 అనుమతుల కోసం రూ. 4కోట్ల 82లక్షలు చెల్లించిందన్నారు. ఇప్పడు ప్రాజెక్టు నిర్మాణానికి అటవీ అనుమతులు పూర్తిగా వచ్చేశాయనీ, ఇక ప్రాజెక్టు నిర్మాణానికి భూసేకరణతో పూర్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ. 16.82కోట్లను విడుదల చేసిందని వెల్లడించారు.

ముందుగా భూసేకరణను పూర్తి చేసుకొని ప్రాజెక్టు నిర్మాణాన్ని మొదలు పెట్టాలని అందుకు గాను రూ.2కోట్ల 94లక్షలను కేటాయించిందన్నారు. మిగతా 13కోట్లతో ప్రాజెక్టుకు మంజూరు త్వరలో వస్తుందన్నారు. రాబోయే రెండు మూడు నెలల్లోనే ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి మండలంలోని బీడు భూములకు సాగునీటిని అందిస్తామన్నారు. ఇది తెలంగాణ ప్రభుత్వం, తన చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. సమావేశంలో ఎంపీపీ ఏగోళపు కమల, వైస్ ఎంపీపీ వేల్పుల గట్టయ్య, పార్టీ మండల అధ్యక్షుడు కొండా శంకర్, పట్టణ అధ్యక్షుడు ఆరెపల్లి కుమార్, రూరల్ అధ్యక్షుడు నక్క సమ్మయ్య, జిల్లా రైతు సమన్వయ కమిటీ సభ్యుడు ఏగోళపు శంకర్‌గౌడ్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు ఖలీల్‌ఖాన్, ఎంపీటీసీ బండారి సమ్మయ్య, నాయకులు తగరం శంకర్‌లాల్, మంథని లక్ష్మణ్, బత్తుల సత్యనారాయణ, మంథని లింగయ్య, కాసిపేట వెంకటేశ్, నక్క శంకర్‌లతో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

109
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...