కొప్పుల, దాసరికి అభినందనల వెల్లువ


Sun,September 9, 2018 02:43 AM

-అభ్యర్థిత్వం ఖరారుపై నాయకులు, కార్యకర్తల హర్షం
-పుష్పగుచ్ఛాలు అందజేత, సన్మానం
-సందడి వాతావరణం..
ధర్మారం: కరీంనగర్‌లోని శ్రీపురం కాలనీలో ధర్మపురి తాజా మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ ఇంటివద్ద శనివారం నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్ నాయకుల సందడి కనిపించింది. ధర్మపురి నియోజకవర్గం నుంచి కొప్పుల ఈశ్వర్‌కు పార్టీ టికెట్ ఖరారు చేసినట్లు సీఎం కేసీఆర్ తొలి జాబితాలోనే ప్రకటించారు. అదే క్రమంలో టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ సభ్యుడిగా కూడా ఈశ్వర్ పేరును చేర్చినట్లు కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొప్పుల నివాసానికి ధర్మపురి, ధర్మారం, వెల్గటూరు, బుగ్గారం, గొల్లపల్లి, పెగడపల్లి మండలాల నాయకులు తరలివచ్చి ఈశ్వర్‌కు పుష్ప గుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులతో పాటు ఆయా శాఖల అధ్యక్షులు ఆయనను కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా పలువురికి సీఎంఆర్ ఎఫ్, డీఎంఎఫ్‌టీ అభివృద్ధి నిధుల ప్రొసీడింగ్ పత్రాలను కొప్పుల అందజేశారు.

కలెక్టరేట్: పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిత్వాన్ని తాజా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డికే ఖరారు చేస్తూ సీఎం కేసీఆర్ ప్రకటించడంతో నియోజకవర్గ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో శనివారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయం వ్యాపారులు, ఉద్యోగ, మైనార్టీ సంఘాల నాయకులు, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో సందడిగా మారింది. తాజా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డికి క్యాంపు కార్యాలయానికి చేరుకున్న వారంతా పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలుపుతూ పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. శుభాకంక్షలు తెలిపిన వారిలో మున్సిపల్ చైర్మన్ ఎలువాక రాజయ్య, ప్రముఖ వ్యాపారవేత్త ఓంప్రకాశ్ జకోటియా, అహ్మద్ బేగ్, మక్సూద్‌బేగ్, ఎంఏ హమీద్, అఖిల్, సయ్యద్, సాబీర్‌ఖాన్, ఆదిల్, సిద్ధిక్ ఉల్లా, ఉమేర్, టీఆర్‌ఎస్‌వీ జిల్లా కో-ఆర్డినేటర్ కొయ్యడ సతీశ్‌గౌడ్, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు మర్కు లక్ష్మణ్, కొట్టె మహేందర్, గుండేటి మధుయాదవ్, అశోక్, మంగారావు, శ్రీకాంత్, శివప్రసాద్, వెంకన్న, అంజన్నతో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.

101
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...