వైభవంగా లక్ష బిల్వార్చన


Sun,September 9, 2018 02:30 AM

-పూజల్లో పాల్గొన్న 250 జంటలు
-భక్తిపరవశంతో మార్మోగిన మల్లన్న ఆలయం
ఓదెల: ఓదెల మల్లికార్జునస్వామి ఆలయంలో శ్రావణ మాసోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం సామూహిక లక్ష బిల్వార్చన పూజా కార్యక్రమాలను వేదపండితులు వైభవంగా జరిపారు. మాసశివరాత్రి సందర్భంగా సామూహిక లక్ష బిల్వార్చన జరిపినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అలాగే అమ్మ వారికి కుంకుమార్చన, బిల్వ పత్రి, బిందె తీర్థం, శివ పుణ్యహా వాచనము, మహాహారతి, మంత్ర పుష్పం, మారేడు చెట్టు వద్ద పత్రి పూజ తదితర కార్యక్రమాలు జరిగాయి. ఇందులో వివిధ ప్రాంతాల నుంచి 250కు పైగా దంపతులు వచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్నిరకాల సౌకర్యాలను ఆలయ ఈఓ రాజేం ద్రం, సిబ్బంది, అర్చకులు కల్పించారు. వేదపండితులు దూపం వీరభద్రయ్య, మఠం భద్రయ్య, పంచాక్షరి, గంగాధర్, భవానీప్రసాద్ తదితరులు పూజా కార్యక్రమాలను నిర్వహించగా, ఆలయ మాజీ చైర్మన్ ఆళ్ల రాజిరెడ్డి, మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, ఎంపీటీసీలు బోడకుంట లక్ష్మి, రాపర్తి శాంత, మాజీ ఎంపీటీసీ బోడకుంట చినస్వామి తదితరులు పాల్గొన్నారు.

103
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...