టీఆర్‌ఎస్‌దే గెలుపు


Sun,September 9, 2018 02:29 AM

-తాజామాజీ ఎమ్మెల్యే కొప్పుల
కమాన్‌పూర్: రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించడం తథ్యమని తాజా మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ ధీమా వ్యక్తం చే శారు. మండలకేంద్రంలోని ఆదివరాహస్వామి ఆలయంలో శనివారం కొప్పుల దంపతులు ప్ర త్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు జరిగాయన్నారు. పేదింటి ఆడపడుచుల కుటుంబాలకు అండగా ఉండాలనే సంకల్పంతో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను తీసుకొచ్చామన్నారు. యువతకు ఉపాధి అవకాశాల కోసం కార్పొరేషన్ రుణాలను అందించామని గుర్తుచేశారు. విద్యారంగ అభివృద్ధికి పెద్దసంఖ్యలో గురుకులాలను ఏర్పాటు చేశామని వివరించారు.

మిషన్ కాకతీయ పథకంతో గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులు, కుంటలకు పూర్వ వైభవం తీసుకువచ్చామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంతో తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలం కాబోతోందని ఉద్ఘాటించారు. రైతుబంధు పథకం ద్వారా రైతులకు ఎకరాకు పెట్టుబడి కోసం రూ.8 వేలు అందిస్తున్నామని, ఇప్పటికే మొదటి విడతగా రూ.4 వేలు అందించామని గుర్తుచేశారు. రైతు బీమాతో మరణించిన రైతుల కుటుంబాలకు రూ.5లక్షలు అందించి వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నామని పేర్కొన్నారు. మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీటిని అందించే కార్యక్రమాన్ని చేపట్టామని వివరించారు. టీఆర్‌ఎస్ పార్టీకి ప్రజల ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందన్నారు. వారి ఆశీర్వాదంతో రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అత్యధిక స్థానాలను గెలవడం తధ్యమని స్పష్టం చేశారు.

106
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...