చెరువుల్లోకి చేపపిల్లలు


Sun,September 9, 2018 02:28 AM

పాలకుర్తి : తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా అందజేసిన 3 లక్షల చేపపిల్లల్ని మండలంలోని ఎనిమిది చెరువుల్లో శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈసాలతక్కళ్లపల్లి పెద్దచెరువు వద్ద మత్స్యసహకారసంఘం సమావేశం నిర్వహించగా, ఎంపీపీ ఆడేపు రాజేశం మాట్టాడారు. సమైక్య ప్రభుత్వాలు మత్స్యకారుల కనీస అవసరాలను కూడా తీర్చలేదనీ, టీఆర్‌ఎస్ హయాంలో సీఎం కేసీఆర్ గత రెండేళ్లుగా మత్స్యకారులకు ఉచితంగా చేపపిల్లలు పంపిణీ చేయడంతోపాటు, చేపలు అమ్ముకోవడానికి వాహనాలను కూడా ఉచితంగా సరఫరా చేస్తున్నారని కొనియాడారు. పాలకుర్తి, ఈసాలతక్కళ్లపల్లి, కొత్తపల్లి, కుక్కలగూడూర్, ఎల్కలపల్లి గ్రామపంచాయతీల్లోని ఎనిమిది చెరువుల్లో 3 లక్షల చేప పిల్లలను పోశామనీ, మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టుతోపాటు, 14 మండలాల్లో ఉన్న 1101 చెరవుల్లో 22 లక్షల చేపపిల్లలు పోస్తున్నామని జిల్లా మత్స్యశాఖ అధికారి మల్లేషం తెలిపారు. రూ.83 లక్షలతో మత్స్యకారులకు అందిస్తున్న చేప విత్తనాలతో వేలాది కుటుంబాలు ఉపాధి పొందనున్నాయని చెప్పారు. మత్స్యసమకార సంఘం అధ్యక్షుడు ఎల్లంకి రామస్వామి, ఎంపీటీసీ ఎర్రం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

96
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...