మట్టి గణపతులనే పూజిద్దాం..


Sun,September 9, 2018 02:27 AM

కలెక్టరేట్: కాలుష్యరహితమైన మట్టి వినాయక ప్రతిమలను నెలకొల్పి వాటినే పూజించాలన్న కలెక్టర్ శ్రీదేవసేన సూచనలతో యువత ముందుకు సాగుతూ ఆదర్శంగా నిలిచేందుకు సన్నద్ధమయ్యారు. కులవృత్తులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం రెండునెలల క్రితమే కుమ్మర కులస్తులకు మట్టి పాత్రల తయారీకి కుమ్మర కులస్తులకు దిశానిర్దేశం చేస్తూ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించిన విషయం విధితమే. ఈ శిక్షణను సద్వినియోగం చేసుకుంటూ కుమ్మర కులస్తులు రానున్న వినాయక చవితికి మట్టి విగ్రహాల ప్రతిమలను తయారు చేసే పనిలో పడ్డారు. మట్టి ప్రతిమల ను తయారు చేస్తూ ఆర్థికాభివృద్ధి పొందనున్నారు. మరోవైపు గతంలో పలు రకాల రసాయనాలు కలగలిపి తయారు చేసే విగ్రహాలను నెలకొల్పి చెరువుల్లో నిమజ్జనం చేస్తే జల కాలుష్యంతో చాలా ప్రమాదాలు ఉన్నాయన్న ప్రభుత్వ యంత్రాంగం హెచ్చరికలు, సూచనలతో యువకులంతా మట్టి విగ్రహాల ఏర్పాటుపై దృష్టిసారించారు. పట్టణంలోని అమర్‌నగర్‌లో ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో 36 అడుగుల ఎత్తు గల మట్టి విగ్రహాన్ని పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి కళాకారులను ప్రత్యేకంగా రప్పించి, సుమారు రూ.6లక్షల ఖర్చుతో తయారు చేయిస్తున్నారు. సుభాష్‌నగర్‌లో సుభాష్ యూత్ ఆధ్వర్యంలో యువకులు 25 అడుగుల ఎత్తుగల మట్టి విగ్రహాన్ని హైదరాబాద్ మేడిపల్లికి చెందిన కళాకారులచే తయారు చేయించి రంగులు వేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇదిలా ఉండగా, తెనుగువాడలో అందరి కంటే భిన్నంగా ముదిరాజ్ కులస్తులంతా కలిసి గడ్డి వినాయకుడిని తయారు చేసి పూజలకు సిద్ధంగా ఉంచారు. మట్టి వినాయకులను ప్రతిష్ఠించేందుకు ఉత్సాహం చూపుతున్నారు.

84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...