సభకు సంబురంగా..


Sat,September 8, 2018 01:40 AM

చిగురుమామిడి/సైదాపూర్ : హుస్నాబాద్‌లో శుక్రవారం టీఆర్‌ఎస్ నిర్వహించిన ఆశీర్వాద బహిరంగ సభకు నియోజకవర్గ పరిధిలోని చిగురుమామిడి, సైదాపూర్ మండలాలకు చెందిన టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. సీఎం దత్తత గ్రామమైన చిన్నముల్కనూర్‌లో సభకు సంబంధించిన మండల ఇన్‌చార్జి, కరీంనగర్ తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పెద్ద సంఖ్యలో ప్రజలతో బైక్ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మహిళల కోలాట ప్రదర్శన చేపట్టారు. కార్యకర్తల నడుమ గంగుల కమలాకర్ బ్యాండు బజాయించి పాదయాత్ర ప్రారంభించారు. సుందరగిరిలో బైక్ నడుపుతూ సభా స్థలి వద్దకు శ్రేణులతో బయలుదేరారు. చిన్నముల్కనూరులో టీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు పన్యాల శ్యాంసుందర్‌రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు బుర్ర తిరుపతి, ఎంపీటీసీ ముప్పిడి సంగీత దేవేందర్‌రెడ్డి, సాంబారి కొంరయ్య, పెసరి రాజేశం ఆధ్వర్యంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. ముదిరాజ్‌లు తోపెలతో సభా స్థలికి పాదయాత్రగా వెళ్లారు. రామంచలో గ్రామశాఖ అధ్యక్షుడు దాసరి సాంబయ్య, ఆర్‌ఎస్‌ఎస్ గ్రామ కోఆర్డినేటర్ సిద్దెంకి రాజమల్లు ఆధ్వర్యంలో మహిళలు బతుకమ్మ ఆటను ఆడి సభకు బయలుదేరారు.

రేకొండ, బొమ్మనపల్లి, ఇందూర్తి, సుందరగిరి, కొండాపూర్, తదితర గ్రామాల్లో జడ్పీటీసీ వీరమల్ల శేఖర్, మండల అధ్యక్షుడు రామోజు కృష్ణమాచారి, మహిళా అధ్యక్షురాలు అందె సుజాత, ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి అరుణ, బుర్ర శ్రీనివాస్, తదితరులు గ్రామాల్లో పర్యటించి భారీగా జనాలను తరలించారు. సైదాపూర్ మండలంలోని వివిధ గ్రామాల నుండి బైక్‌లు, జీపులు, ఆటోలు, ట్రాక్టర్లపై సభకు జారతలా తరలివెళ్లారు. ఈ సందర్భంగా మండలకేంద్రంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన యువకులు నిర్వహించిన బైక్ ర్యాలీ పలువురిని ఆకట్టుకుంది. జడ్పీటీసీ బిల్ల వెంకటరెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు సోమారపు రాజయ్య, వావిలాల ఖాదీబోర్డు డైరక్టర్ పేరాల గోపాలరావు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మునిగంటి స్వామి మండలకేంద్రంలో ర్యాలీ ప్రారంభించారు. టీఆర్‌ఎస్ నాయకులు సభకు వచ్చే వారికోసం వాహనాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆర్‌ఎస్‌ఎస్ మండల కోఆర్డీనటర్ రావుల రవీందర్‌రెడ్డి, జిల్లా కమిటీ సభ్యుడు తాటిపల్లి యుగేందర్‌రెడ్డి, హుజురాబాద్ మార్కెట్ కమిటీ డైరక్టర్ పోలు ప్రవీన్, టీఆర్‌ఎస్ మండల శాఖ మాజీ అధ్యక్షుడు చంద శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ బెదరకోట రవీందర్ పాల్గొన్నారు.

102
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...