భక్తజనసంద్రం


Sat,September 8, 2018 01:40 AM

వేములవాడ కల్చరల్ : శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్భంగా వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం భక్తజన సంద్రంగా మారింది. వేకువజాముననే భక్తులు పవిత్ర ధర్మగుండంలో స్నానాలు ఆచరించి కోడెమొక్కు చెల్లించుకున్నారు. భక్తులు కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకుని,తామెత్తు బెల్లాన్ని పంచిపెట్టారు. శ్రావణమాసంలో భక్తుల రద్దీని పురస్కరించుకుని ఆలయ అధికారులు గర్భగుడిలో భక్తులు నిర్వహించుకునే అభిషేక పూజలు,అన్నపూజలు రద్దు చేశారు. నాగిరెడ్డి మండపంలోగల సోమేశ్వరస్వామివద్ద, రాజన్న అనుబంధ భీమేశ్వరాలయంలో అభిషేక పూజలు నిర్వహించుకున్నారు. వివిధ ఆర్జితసేవల ద్వారా రాజన్నకు సుమారు రూ.13 లక్షల ఆదాయం సమకూరినట్లు , రాజన్నను దాదాపు 20 వేలకుపైగా భక్తులు దర్శించుకున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు.

85
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...