మూల విజయారెడ్డికి రాష్ట్ర స్థాయి పురస్కారం


Mon,March 6, 2017 11:49 PM

-తెలంగాణ ఉత్తమ ఉద్యమకారిణిగా అవార్డు
-ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
-మహిళా దినోత్సవాన ప్రదానం
గోదావరిఖని, నమస్తే తెలంగాణ: రాష్ట్ర సాధ న ఉద్యమంలో ఆది నుంచి వెన్నంటి ఉండి, తన గళంతో ప్రజల్ని చైతన్యవంతం చేసిన గోదావరిఖనికి చెందిన మూల విజయారెడ్డికి రాష్ట్ర స్థాయి పురస్కా రం దక్కింది. తెలంగాణ ఉత్తమ ఉద్యమకారిణిగా ఎంపికచేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని లలి తా కళాతోరణంలో నిర్వహించనున్న వేడుకల్లో ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా మూల విజయారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ కోసం ఉద్యమించిన తనకు ప్రభుత్వం ఈ గుర్తింపు ఇవ్వ డం చాలా సంతోషంగా ఉందనీ, తనకు తండ్రి దండ తిరుపతి రెడ్డి స్ఫూర్తి అని చెప్పారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న తన తండ్రి 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో దీక్ష చేపట్టి 10 రోజులు జైలు జీవితం గడిపినట్లు పేర్కొన్న ఆమె, ఎన్నో ఒడిదొడుకుల మధ్య ఊపిరి ఉన్నంత వరకు పోరాడారని గుర్తు చేసుకున్నారు. వృత్తి నుంచి విశ్రాంతి తీసుకున్న తర్వాత రాష్ట్రం కోసం పోరాడారనీ, ఈ క్రమం లో టీఆర్‌ఎస్ రిటైర్డు ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఇచ్చారని గుర్తు చేశారు. నాన్న స్ఫూర్తితో, ఆయన ఆశయ సాధన కోసం మలిదశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నానని తెలిపారు. ఏదిఏమైనా తనను తెలంగాణ ఉద్యమకారిణిగా ప్రభుత్వం గుర్తించడం గర్వంగా ఉందని చెప్పారు.

108
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...