అర్హత ఏదైనా బదిలీ వర్కరే..


Tue,January 10, 2017 11:51 PM


రామగిరి : వారసత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి ఏ విద్య అర్హతలు ఉన్నా ముందుగా బదిలీ వర్కర్‌గానే పరిగణిస్తామని ఓసీపీ-2 ప్రాజెక్ట్ అధికారి హనుమకొండ వీరాస్వామి తెలిపారు. సింగరేణిలో అమలు చేస్తున్న వారసత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకున్న పలువురి ఆభ్యర్థులకు అధికారులు మంగళవారం కౌన్సెలింగ్ చేశారు. ఇంజినీరింగ్, పీజీ డిప్లొమా చేసిన యువకులు 16 మంది తమ తండ్రులకు సంబంధించిన స్థానంలో ఉద్యోగం కోసం తమ విద్య అర్హతలతో దరఖాస్తు చేసుకోగా సింగరేణిలో ఉద్యోగం పొందితే అందుకు గల నియమ నిబంధనలను వివరించారు. డిపెండెంట్ మైనింగ్ యాక్ట్ ప్రకారం మాత్రమే నియామకాలు చేపడుతామని అధికారి పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ మేనేజర్ రాజశేఖర్, టీబీజీకేఎస్ నాయకులు మామిడి స్వామి, మల్లయ్య తదితరులున్నారు.

335
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS