ఖనిలో కార్డన్ సెర్చ్


Tue,January 10, 2017 11:50 PM


ఫెర్టిలైజర్‌సిటీ: రామగుండం పోలీస్ కమిషనర్ విక్రంజిత్ దుగ్గల్ ఆదేశాల మేరకు గోదావరిఖని నగర శివారులోని ఇందిరానగర్, సంజయ్ గాంధీనగర్ కాలనీలో వన్ టౌన్ సీఐ వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో మంగళవారం 100 మంది సివిల్, ఏఆర్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఉదయం 5.30 గంటలకు ఇందిరానగర్, సంజయ్ గాంధీ నగర్‌లోని ఇంటింటికీ వెళ్లి సోదాలు నిర్వహించారు. అనుమానితులను కొత్తగా కన్పించిన వారిని ప్రశ్నించారు. ఇండ్లలో ఉన్న ద్వి, త్రిచక్ర వాహనాల రిజిస్ట్రేషన్, ఇతరత్రా వాహనాల కాగితాలను అడిగి తెలుసుకున్నారు.

ఇందిరానగర్‌లో అనుమతి లేని 35 ద్విచక్ర వాహనాలు, ఓ ఇంట్లో నిల్వ ఉంచిన 60 లీటర్ల కిరోసిన్ రెండు చిన్న డ్రమ్ములను, నిల్వ ఉంచిన టన్ను బొగ్గు, ఆటో, ఒక కారును, సంజయ్ గాంధీనగర్‌లో 15 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. అనంతరం స్థానికులతో సీఐ వెంకటేశ్వర్ మాట్లాడారు. అనుమానితుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని, కొత్త వ్యక్తులకు ఇండ్ల అద్దెలను ఇవ్వరాదని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలన్నారు. విద్యార్థులతో పనులు చేయించవద్దని పేర్కొన్నారు. ప్రతి ద్విచక్ర వాహనాలకు బీమా చేయించాలని సూచించారు. వన్‌టౌన్ ఎస్‌ఐలు మహేందర్, దేవయ్య, శ్రీనివాస్, పోలీసు సిబ్బంది తదితరులున్నారు.

199
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS