నర్సరీకి రెండు లక్షల మొక్కలు పెంచాలి


Tue,January 10, 2017 11:50 PM

కలెక్టరేట్: హరితహారం పథకం విజయవంతానికి ప్రతి నర్సరీలో రెండు లక్షల మొక్కల పెంపకం లక్ష్యంగా అధికారులు, సిబ్బంది పని చేయాలని కలెక్టర్ అలుగు వర్షిణి సూచించారు. అంతర్గాం మండలం గోలివాడ, రాయదండిలోని మొక్కల పెంపకం కేంద్రాలను కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా నర్సరీల్లో పెంచుతున్న మొక్కల వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఒక్కో నర్సరీలో రెండు లక్షల మొక్కల పెంపకం లక్ష్యమనీ, పూలు, పండ్లు, నీడనిచ్చే, అడవీప్రాంతాల్లో కలప నిచ్చే మొక్కలను పెంచుతున్నారని కలెక్టర్ వివరించారు.

మండలంలోని అన్ని గ్రామాల్లో నిర్వహించిన డిమాండ్ సర్వే ప్రకారం మొక్కలు పెంచాలని ఆదేశించారు. మొక్కలను పెంచడం ఎంత ముఖ్యమో వాటిని సంరక్షించడం కూడా అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉందని పేర్కొన్నారు. అధికారులు స్థానిక ప్రజాప్రతినిధుల సహకరంతో హరిత హారం విజయవంతం కోసం కృషి చేయాలనీ, జిల్లా అధికారులందరూ అందుబాటులో ఉంటారన్నారు. అనంతరం మూర్మూర్‌లో 20 హెక్టార్లలో మొక్కలు నాటే భూమిని కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డీఎఫ్‌ఓ కృష్ణమాచారి, ఎఫ్‌ఆర్‌ఓ జగదీశ్ చంద్రర్‌రెడ్డి, సెక్షన్ అధికారి ఓదెలు, బీట్ ఆఫీసర్ శ్రీనివాస్‌రెడ్డి తదితరులున్నారు.

137
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS