ప్రణాళికతో ముందుకు సాగాలి


Tue,January 10, 2017 11:49 PM


జ్యోతినగర్: రామగుండం నగర అభివృద్ధికి పక్కా ప్రణాళికలతో ముందుకు సాగాలని కలెక్టర్ అలుగు వర్షిణి ఆదేశించారు. అర్బన్ డేను పురస్కరించుకొని రామగుండం, పెద్దపల్లి మున్సిపల్ అభివృద్ధిపై ఎన్టీపీసీలోని ఈడీసీ మిలీనియం హాల్‌లో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. బల్దియాలో వంద శాతం నగదు రహిత లావాదేవీలు కొనసాగించాలని సూచించారు. హరితహారంలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నగర అభివృద్ధికి సంబంధించిన ప్రణాళిక మ్యాప్‌ను ప్రొజెక్టర్ ద్వారా బల్దియా అధికారులు ప్రదర్శించారు. రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనులను వేగంగా చేసేందుకు ప్రణాళికను రూపొందించినట్లు కలెక్టర్ తెలిపారు. నగరంలో తాగునీటి వ్యవస్థను మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని వివరించారు. నగర సుందరీకరణలో భాగంగా వీధి లైట్ల పనితీరు బాగు చేయాలని సూచించారు. హరితహారం పురోగతిపై సమీక్షించారు. హరితహారం కార్యక్రమానికి పూర్తి స్థాయి కార్యాచరణ ప్రణాళికతో ఇప్పటిను ంచే రూపొందించుకోవాలని సూచించారు. రామగుండంలో ఎన్టీపీసీ, సింగరేణి, జెన్ కో ఇతర పరిశ్రమల సహకారంతో గతేడాది 3, 56, 190 మొక్కలు నాటగా, 2,26,000 పంపిణీ చేసినట్లు గుర్తు చేశారు.

మొక్కల సంరక్షణకు 10వేల ట్రీగార్డులను అందించినట్లు పేర్కొన్నారు. పెద్దపల్లిలో 40వేల లక్ష్యానికి 59,330మొక్కలు నాటామన్నా రు. ఈ ఏడాది ఎన్ని రకాల మొ క్కలు కావాలో తెలియజేస్తే నర్సరీలో పెంచి అందజేస్తామన్నారు. ప్రజలకు కావాల్సిన మొక్కలు అందించేందుకు వెంటనే సర్వేతో నివేదికను సమర్పించాలని ఆదేశించారు. హరితహారంలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదన్నారు. మొ క్కలను పర్యవేక్షించేందుకు స్వయంగా వస్తాననీ, ఎక్కడ ఒక్క మొక్క కూడా లెక్క తప్పినా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. పెద్దపల్లిని గ్రేడ్-2 మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయాల్సిన ఉన్నందున పరిసర గ్రామాల విలీనం కోసం ఆయా గ్రామ పంచాయితీల తీర్మాణాలు పొందాలన్నారు. నగర పాలక సంస్థ పరిధిలోని ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని సూచించారు. వర్షాకాలం రాకముందే 50 డివిజన్లలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చాలని సూచించారు. నగర పాలక సంస్థ కార్యాలయ ఉద్యోగులు మొబైల్ బ్యాంకింగ్, ఆన్‌లైన్‌లో లావాదేవీలపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకొని ఆ పద్ధతిని అనుసరించాలని పేర్కొన్నారు. సమావేశంలో నగర మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, పెద్దపల్లి నగర పంచాయితీ చైర్మన్ రాజయ్య, డీసీపీ విజయేందర్ రెడ్డి, పెద్దపల్లి కమిషనర్లు జాన్ శ్యాంసన్, సత్యనారాయణ, డిప్యూటీ మేయర్ సాగంటి శంకర్ తదితరులున్నారు.

189
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS