ఉపాధికి ఆధార్‌ం!


Tue,January 10, 2017 11:49 PM

మంథని, నమస్తే తెలంగాణ: గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కూలీల ఆధార్ కార్డు అనుసంధానిస్తున్నారు. ఇప్పటికే 80శాతంగా పూర్తైన ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు మార్చి 31 చివరి తేదీగా ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు 100 రోజుల పనిదినాలను కల్పించాలని కేంద్రం ప్రభుత్వం నిర్ణయించి ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టగా, నిర్వహణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొనసాగించేది. ఈ క్రమంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆ నిధులను దారి మళ్లించి ఇతర పథకాలకు ఖర్చు చేసి నెలల గడిచిన తర్వాత కూలీలకు ఇచ్చేది. దీంతో పథకంపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది.

ఈ క్రమంలో కూలీల ఖాతాల్లోనే డబ్బులు వేయాలనే నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం వచ్చి అమలు చేస్తున్నది. అయినా కొందరు కూలీలు తమ ఖాతాల్లో డబ్బులు పడడం లేదని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ప్రతి కుటుంబానికి రెండు, మూడు, నాలుగు ఖాతాలు కూడా ఉండడంతో దేనిలో పడ్డాయనే వివరాలు తెలుసుకోకుండానే ఆందోళనకు గురవుతున్నారు. ఉపాధి హామీ కూలీ చివరగా ఏ ఖాతాకైతే ఆధార్ కార్డును అనుసంధానం చేస్తారో ఆ ఖాతాలోనే డబ్బులు పడుతున్నాయి. ఇప్పటికీ ఆధార్ కార్డును ఉపాధి హామీ సిబ్బందికి సమర్పించలేదో అలాంటి వారి ఖాతాల్లో కూడా కూలీ డబ్బులు పడే అవకాశం లేదు.

ఇంకా 20 శాతం రావాలి..


ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీ ప్రతి ఒక్కరూ తమ ఆధార్ కార్డులను ఉపాధిహామీ సిబ్బందికి సమర్పించాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇంకా జిల్లాలో దాదాపుగా 20శాతం మం ది కూలీలు తమ కార్డులను సమర్పించలేదు. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం మార్చి 31లోగా తమ ఆధా ర్ కార్డులను సమర్పించాలని సూచించింది. ఆ లోపు ఉపాధిహామీ సిబ్బందికి ఇవ్వని కూలీలకు పనులు చూపడం కూడా జరగదని స్పష్టం చేసింది. ఏప్రిల్ 1 తేదీ దాకా ఆధార్ కార్డులు లేని వారు అది పొందే దాకా తమ రేషన్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, కిసాన్ పాసు పుస్తకం, డ్రైవింగ్ లైసెన్స్, గెజిటెడ్ అధికారి ఇచ్చిన ధ్రువీకరణ పత్రం, ఉపాధిహామీ జాబ్ కార్డుల్లో ఏదో ఒక దానిని తమ గుర్తింపు పత్రంగా చూపించి ఉపాధిహామీ పథకం ద్వారా కలిగే ప్రయోజనాలను పొందవచ్చని ప్రభుత్వం వివరించింది.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS