గ్యాస్ ట్యాంకర్ బోల్తా


Tue,January 10, 2017 11:48 PM

రామగుండంరూరల్: పాలకుర్తి మండలం బసంత్‌నగర్ సమీపంలో ఓ గ్యాస్ ట్యాంకర్ మంగళవారం బోల్తాపడింది. వైజాగ్ నుంచి చంద్రాపూర్‌కు 18టన్నుల బరువుగల హెచ్‌పీ(వంటగ్యాస్)తో వెళ్తున్న ట్యాంకర్ బుగ్గ సమీపంలో రాజీవ్ రహదారిపై రైల్వేై ఫ్లెఓవర్‌పై నుంచి మూలమలుపు వద్ద అదుపుతప్పి సమీపంలోని లోయలో పడింది. దీంతో డ్రైవర్ అబ్దుల్‌షేక్‌కు గాయాలయ్యాయి. అంతర్గాం ఎస్‌ఐ ప్రమోద్‌రెడ్డి చేరుకొని డ్రైవర్‌ను బసంత్‌నగర్ పీహెచ్‌సీకి తరలించారు.

ట్యాంకర్ నుంచి గ్యాస్ లీకేజీ..


బోల్తాపడ్డ ట్యాంకర్ నాజిల్ నుంచి గ్యాస్ లీకేజీ అయింది. దీంతో మంటలు వ్యాపించి, చెట్లకు అంటుకొని ప్రమాదం పొంచి ఉండడంతో పోలీసులు ముందస్తుగా గోదావరిఖని నుంచి ఫైరింజన్ తెప్పించి నీళ్లు చల్లిస్తున్నారు. తగ్గకపోవడంతో ఎంసిల్ లాంటి ప్రయోగాలు చేసినా ఆగలేదు. అగ్నిప్రమాదం జరగకుండా పోలీసులు, కుందనపల్లి ఇంధననిల్వ కేంద్రం సిబ్బందితో పరిశీలింపజేయిస్తున్నారు.

వైజాగ్ నుంచి రెస్కూ ్యటీం..


ప్రమాదం జరిగిన వెంటనే స్థానికంగా ఇంధననిల్వ కేంద్రాల రెస్య్కూటీంను పోలీసులు పిలిపించారు. స్థానికులకు గ్యాస్‌లీకేజీని అరికట్టే రెస్క్యూ టీం లేకపోవడంతో విషయం వైజాగ్‌లోని గ్యాస్ సరఫరా కేంద్రానికి సమాచారం ఇచ్చారు. రెస్క్యూటీం వైజాగ్ నుంచి మరో ట్యాంకర్‌తో ప్రమాద స్థలానికి వస్తున్నట్లు అంతర్గాం ఎస్‌ఐ తెలిపారు. పెద్దపల్లి డీసీపీ విజయేందర్‌రెడ్డి, ఎన్టీపీసీ సీఐ వాసుదేవరావు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రయాణికులు ఎవరూ ఉండకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

జనావాసాల్లో అయితే..


బసంత్‌నగర్ బుగ్గ సమీపంలో ట్యాంకర్ అటవీప్రాంతంలో బోల్తాపడింది. అదే బసంత్‌నగర్, పెద్దపల్లి, గోదావరిఖని ప్రాంతాల్లో జనావాసాల వద్ద బోల్తాపడితే భారీ ప్రాణ, ఆస్తినష్టం సంభవించేంది. డ్రైవర్ అతివేగంగా ట్యాంకర్ నడపడంతోనే లారీ సమీపంలోని లోయలో పడ్డట్లు ఎస్‌ఐ తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నట్లు తెలిపారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS