ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై డీసీపీ పరిశీలన


Tue,January 10, 2017 11:47 PM

ఫెర్టిలైజర్‌సిటీ: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని గోదావరిఖని నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై పెద్దపల్లి డీసీపీ విజయేందర్‌రెడ్డి మంగళవారం పరిశీలన చేపట్టారు. ఈ మేరకు ఆయన ఖని ప్రధాన చౌరస్తాలోని ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు, ఫైవింక్లయిన్ చౌరస్తాలో ట్రాఫిక్ ఐలాండ్ నిర్మాణంపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. క్రమబద్ధీకరణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఐలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట సీఐ వెంకటేశ్వర్, ట్రాఫిక్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై లక్ష్మయ్య ఉన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS