గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు!


Tue,January 10, 2017 11:46 PM


పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: పెద్దపల్లి జిల్లా కేంద్రంగా ఏర్పాటైన తొలిసారిగా నిర్వహిస్తున్న గణతంత్ర దినోత్సవ వేడుకలను భారీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అలుగు వర్షిణి అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. 2016 అక్టోబర్ 11న పెద్దపల్లి జిల్లాగా ఆవిర్భవించిన విషయం తెలిసిందే. ఈనెల 26వ తేదీన గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం విధితమే. జిల్లా ఏర్పాటు తరువాత తొలిసారిగా నిర్వహిస్తున్న గణతంత్ర వేడుకల సందర్భంగా జాతీయ పతకాన్ని ఆవిష్కరించడంతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల తరఫున శకటాల ప్రదర్శన నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

కలెక్టర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు గణతంత్ర వేడుకల ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంపై జాతీయ పతకా ఆవిష్కరణతో పాటు సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. జిల్లా హోదాలో తొలిసారిగా నిర్వహిస్తున్న వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. వేడుకలకు ముఖ్య అతిథిగా ఎవరిని ఆహ్వానిస్తారో తెలియని పరిస్థితి. పతకా ఆవిష్కరణకు రాష్ట్ర మంత్రుల్లో ఎవరూ హాజరు అవుతారనేది తెలియాల్సి ఉంది.

261
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS