తహసీల్ ఎదుట చెత్త పోసి నిరసన


Tue,January 10, 2017 11:46 PM


సుల్తానాబాద్: మండల కేంద్రంలోని నీటిపారుదలశాఖకు చెందిన స్థలంలో చెత్తను పోయనివ్వడం లేదంటూ మంగళవారం గ్రామ పంచాయతీ సిబ్బంది తహసీల్దార్ కార్యాలయం ఎదుట , అంబేద్కర్ చౌరస్తాల్లో చెత్త పోసి నిరసన తెలిపారు. ఇరిగేషన్‌కు కార్యాలయానికి చెందిన స్థలం ఖాళీ ఉండడంతో జీపీ సిబ్బంది అందులో చెత్తను పోసి డంప్‌యార్డుకు తరలించే వారు. ఇటీవల కలెక్టర్ అలుగు వర్షిణి ఆ స్థలాన్ని పరిశీలించి, అందులోని చెత్తను తొలగించాలని తహసీల్దార్ రజితను ఆదేశించారు. ఈ క్రమంలో తహసీల్దార్ చెత్తను తొలగించి, స్థలాన్ని చదును చేయించారు. ఆటోలు, చెత్త బండ్లను స్థలంలోకి అనుమతించలేదు. దీంతో జీపీ సిబ్బంది అంబేద్కర్ విగ్రహం ఎదుట, తహసీల్ కార్యాలయం ఎదుట చెత్తను పోయారు. తహసీల్దార్ గ్రామ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేయగా, చెత్తను తొలగించారు.

స్థలంపై ప్రజాప్రతినిధి కన్ను


ఇరిగేషన్‌కు చెందిన స్థలాన్ని కబ్జా చేయడానికి ఓ ప్రజాప్రతినిధి కుట్ర పన్నుతున్నారని టీఆర్‌ఎస్ నాయకులు గడ్డం సత్యనారాయణ, ఆరేపల్లి జితేందర్ ఆరోపించారు. మంగళవారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. సబ్‌డివిజన్ కార్యాలయం ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు నివేదిక అందించగా, వారి ఆదేశాల మేరకు కలెక్టర్ స్థలాన్ని పరిశీలించి, చదును చేయాలని ఆదేశించారన్నారు. గ్రామ పంచాయతీ చెత్తను వేసేందుకు సర్వే నంబరు 778లో ఐదెకరాల భూమి ఉన్నా వినియోగించడం లేదన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS