మహిళా సాధికారతతోనే ఆర్థికాభివృద్ధి


Tue,January 10, 2017 11:45 PM

యైటింక్లయిన్‌కాలనీ : మహిళల సాధికారతతోనే ఆయా కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని ఆర్జీ-2 జీఎం విజయపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం సీఈఆర్ క్లబ్‌లో ఖాదీ గ్రామోద్యోగ మహా విద్యాలయ హైదరాబాద్ సహకారంతో ఆర్జీ-2 సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన వృత్తి విద్యా కోర్సుల అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. సింగరేణి యాజమాన్యం గృహిణులు, పిల్లలకు, ప్రభావిత గ్రామాల యువతకు వివిధ వృత్తి కోర్సుల్లో శిక్షణ నిచ్చి ప్రోత్సహిస్తుందని తెలిపారు. శిక్షణ పొందిన అభ్యర్థులు నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. తద్వారా ఉపాధి పొందడంతో పాటు ఆర్థికాభివృద్ధి సాధించే వీలుంటుందన్నారు.

వృత్తి శిక్షణ పొందిన వారికి ప్రభుత్వ బ్యాంకుల నుంచి రుణాలందించేలా సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పారు. యువత చెడు వ్యవసనాలకు దూరంగా ఉండి స్వయం ఉపాధి పొందే మార్గాల్లో నడవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌ఓటూ జీఎం కొండమీది రవీందర్, డీజీఎం(ప) ఎన్.వెంకటేశ్వర్‌రావు, సేవా అధ్యక్షురాలు శకుంతల విజయపాల్‌రెడ్డి, ఖాదీ గ్రామోద్యోగ జాయింట్ డైరెక్టర్ రాయప్ప, భాస్కర్‌రావు, సీహెచ్. మూర్తి, రఘు, శివకుమార్, హుస్సేనయ్య, డీవైపీఎం రాజేంద్రప్రసాద్, సేవా సభ్యులు సుజన, ప్రేమలత, మేరీ, కోఆర్డినేటర్లు కర్రి తిరుపతి, శ్రీనివాస్, క్లర్క్ సాంబయ్య పాల్గొన్నారు.

29
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS