సమ్మె పోస్టర్ విడుదల

Tue,January 10, 2017 11:44 PM

రామగుండంరూరల్ : స్కీం వర్కర్లు దేశవ్యాప్తంగా చేపడుతున్న సమ్మె పోస్టర్‌ను సీఐటీయూ నాయకులు మంగళవారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆవిష్కరించారు. అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, సర్వశిక్ష అభియాన్ పథకాల్లో పని చేస్తున్న వారందరికీ కార్మికులుగా గుర్తించి, కనీస వేతనాలు ఇవ్వాలనే డిమాండ్‌తో చేపడుతున్న ఒక రోజు సమ్మెను జయపద్రం చేయాలని కోరారు. 45వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సిఫారసులను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి ఎం.రామాచారి, అంతర్గాం మండల కార్యదర్శి ఆడారి నరసింగరావు, గీట్ల లకా్ష్మరెడ్డి, మాడ సతీశ్, తూడూరి శ్రీనివాస్, రాపోలు కమలేశ్, ఎస్.రామలక్ష్మి పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...