కన్నాలలో ఆరోగ్య అవగాహన సదస్సు


Tue,January 10, 2017 11:44 PM

రామగుండంరూరల్ : పాలకుర్తి మండలం కన్నాల పాతలంబాడితండాలో మంగళవారం బీసీ కాలనీ చర్చి పాస్టర్ జోసఫ్ ఆధ్వర్యంలో ఆరోగ్య అవగాహన కార్యక్రమం జరిగింది. ఎస్‌ఐ విజయేందర్ మాట్లాడుతూ గుడుంబా, గుట్కాలు తిని ఆరోగ్యాలు పాడుచేసుకోవద్దని సూచించారు. వైద్యులు తిరుపతి, సరిత ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు చేసి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సింగిల్‌విండో డైరెక్టర్ సూర సమ్మయ్య, టీఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి దేవి లక్ష్మీనర్సయ్య, దిలీప్, కిషన్‌నాయక్, కె.యేసుదాస్, రాజునాయక్, తిమోతి జయరాజ్, జాకబ్ తదితరులు పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS