గిరిజన యువకుడికి సన్మానం


Tue,January 10, 2017 11:44 PM

రామగుండంరూరల్ : పాలకుర్తి మండలం కన్నాల రాజీవ్‌తండాకు చెందిన లావుడ్య రాజ్‌కుమార్ సింగరేణిలో ఉద్యోగం సాధించడంతో తండావాసులు హర్షం వ్యక్తం చేస్తూ, యువకుడిని సన్మానించారు. సింగరేణి సంస్థ ఇటీవల విడుదల చేసిన జేఎంఈటీ ఫలితాల్లో 77శాతం మార్కులతో రాష్ట్రంలో రెండో స్థానం సాధించగా, తండావాసులు అభినందించారు. చిన్ననాడే తండి షకేలాల్ అనారోగ్యంతో మృతి చెందగా, తల్లి రాజేశ్వరి కష్టపడి చదివించింది. పదో తరగతిలో 9.3 పర్సంటేజీతో ఉత్తీర్ణత సాధించి, బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మైనింగ్‌లో డిప్లమా పూర్తి చేశాడు. ఇటీవల సింగరేణిలో ఉద్యోగాల నోటిఫికేషన్ వెలువడడంతో పరీక్ష రాయగా, ఉత్తమ ర్యాంకుతో ఉద్యోగం సాధించాడు. 19 ఏళ్ల వయసులో ఉద్యోగం సాధించడంపై బదావత్‌రాజునాయక్, శంకర్‌నాయక్, శ్రీనివాస్, కిషన్, సారయ్య, తిరుపతి, సురేష్, చిన్నా, కుమార్ హర్షం వ్యక్తం చేశారు.

146
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS