శిఖం భూములు ఆక్రమించిన వారిపైచర్యలు తీసుకోండి


Tue,January 10, 2017 02:46 AM


కలెక్టరేట్ : కాల్వశ్రీరాంపూర్ మండలం మంగపేట శివారులోని చెరువు శిఖం భూములను ఆక్రమించుకొని పట్టాభూములుగా పేర్కొంటూ చెరువులోకి నీరు రాకుండా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సోమవారం మంగపేటకు చెందిన రైతులు జాయింట్ కలెక్టర్ ఎస్ ప్రభాకర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చెరువులోని భూములను ఆక్రమించుకున్న మారెడుగొండ, గుర్రంపల్లి, వెన్నెంపల్లి గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు చెరువులోకి నీరు రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. అంతే కాకుండా, చెరువుల్లోనే బావులు తవ్వి అక్రమాలకు పాల్పడుతూ, గ్రామ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. సర్పంచ్ ఆధ్వర్యంలో దాదాపు 100 మంది రైతులు జేసీకి ఫిర్యాదు చేసిన అనంతరం అప్పుడే కార్యాలయానికి చేరుకున్న జిల్లా కలెక్టర్‌కు సైతం పరిస్థితిని వివరించారు. ఈ మేరకు విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రైతులకు తెలిపారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS