చివరి ఆయకట్టుకు సాగునీందించేలా చూడాలి

Tue,January 10, 2017 02:46 AM


కమాన్‌పూర్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ద్వారా నీటి విడుదల చేస్తున్న డీ-83 కాల్వ అనుసంధానమైన ఆయకట్టు ప్రాంతానికి నిర్ధేషిత లక్ష్యం మేరకు నీటి సరపరా జరగడం లేదనీ, దీంతో ఆయకట్టు చివరి ప్రాంత రైతులకు సాగునీరు అందని ద్రాక్షగానే మారుతుందనీ, ఇప్పటికైనా ఎస్సారెస్పీ అధికారులు ఆ దిశగ తగు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే పుట్ట మధు చెప్పారు. చొప్పదండి మండలం రేవెళ్లి వద్ద డీ-83, డీ-86 కాల్వల విభజన ప్రదేశాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. డీ-83, డీ-86 కాల్వలకు సమానంగా నీటి విభజన జరుగుతుందనీ, మారుమూల మంథని నియోజకవర్గంలోని చివరి ఆయకట్టుకు సాగు నీరందించలేని పరిస్థితి నెలకొంటుందన్నారు.

ఎస్సారెస్పీ నీటి విడుదల ప్రక్రియలో డీ-86 కాల్వకు విడుదల చేసే నీటి సరఫరా కంటే ఎక్కువగా డీ-83 కాలువకు నీరు విడుద చేయాలనే నిబంధనలున్నాయన్నారు. కాల్వలపై పైభాగంలో ఉన్న రైతుల ప్రయోజనాలతో పాటు దిగువన గల రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అధికారులు పని చేయాలన్నారు. ఆయన వెంట టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు దాసరి రాజలింగు, వైస్‌ఎంపీపీ కొట్టె భూమయ్య, నాయకులు ఇనగంటి రామారావు, పూదరి సత్యనారాయణ, కిషన్‌రెడ్డి, తాటికొండ శంకర్ తదితరులున్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...