కేసీఆర్ సేవా దళం సేవ అభినందనీయం


Tue,January 10, 2017 02:46 AM


ధర్మారం : కేసీఆర్ సేవా దళం స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు అభినందనీయమని పెద్దపల్లి డీఈఓ వెంకటేశ్వర్ రావు పేర్కొన్నారు. కేసీఆర్ సేవా దళం ఆధ్వర్యంలో ధర్మారం, కటికెనపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు స్నాక్స్ పంపిణీ, ధర్మారం పాఠశాల గదులకు కలర్లు వేయించే కార్యక్రమాలను చేపట్టారు. ఈ కార్యక్రమాల సోమవారం డీఈఓ వెంకటేశ్వర్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ధర్మారం జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సరస్వతి ప్రసాదం పేర స్నాక్స్ కోసం కేసీఆర్ దళం ఆధ్వర్యంలో అందించిన చెక్కును హెచ్‌ఎంకు అందించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ కేసీఆర్ దళం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు స్నాక్స్ అందించటం ఎంతో హర్షణీయమన్నారు.

ఇంకా భవిష్యత్తులో మౌళిక వసతుల కల్పనకు ముందుకు రావాలన్నారు. ఇందులో కేసీఆర్ సేవా దళం రాష్ట్ర ఆర్గనైజర్ కటుకోజ్వల రమేశ్‌చారి మాట్లాడుతూ, పదో తరగతి విద్యార్థులు సాయంత్రం చదువుకునే సమయంలో ఆకలి ఇబ్బందులు తొలగించటానికే స్నాక్స్ అందిస్తున్నామని చెప్పారు. ధర్మారంలో జడ్పీ పాఠశాల భవనాల పెయింటింగ్‌కు వరంగల్‌కు చెందిన వ్యాట్సప్ మనముచ్చట్ల బృందం సభ్యులు అమృత రెడ్డి, పెరుమాండ్ల మధు సూదన్, అరవింద్ సహకరించారని తెలిపారు. కార్యక్రమంలో ఆయా జడ్పీ పాఠశాల హెచ్‌ఎంలు పినుమల్ల ఛాయాదేవి, ఎన్. మంజులా దేవి, స్థానిక ఎంఈఓ జంపాల పద్మ, ధర్మారం ఎంపీటీసీ సభ్యుడు బొల్లి స్వామి, టీపాస్ జిల్లా కార్యదర్శి గన్నమనేని రంగారావు, మండల శాఖ అధ్యక్షుడు నూతి మల్లయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

328
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS