గణాంకాల సేకరణ ప్రక్రియను పూర్తి చేయాలి


Tue,January 10, 2017 02:45 AM

కలెక్టరేట్ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్య స్థితిగతులను వివరించేలా గణాంకాల సేకరణ ప్రక్రియను ఈ నెల 19లోగా పూర్తి చేయాలని జిల్లా విద్యశాఖ అధికారి వెంకటేశ్వర్‌రావు సూచించారు. జిల్లా కేంద్రంలో బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం ఎంఈఓలు, ఎంఐఎస్ కో-ఆర్డినేటర్‌కు ఒక రోజు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ, పాఠశాలల్లోని మౌలిక వసతులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు వివరాలను ప్రతి యేటా డైస్ ద్వారా నిర్వహించడం జరుగుతుందనీ, ఇలా సేకరించిన వాటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించడం జరుగుతుందన్నారు. కొత్త జిల్లాలు అక్టోబర్ 11న ఏర్పడినందున డిసెంబర్ 31 ప్రాతిపదికన వివరాలు సేకరించడం జరుగుతుందన్నారు.

అన్ని మండల కేంద్రాలల్లో మంగళవారం సమావేశాలు నిర్వహించి హెచ్‌ఎంలు, కళాశాల ప్రిన్సిపాళ్లు, కేజీవీబీ ఎస్‌ఓలు, డీసీఎఫ్‌లను తప్పనిసరిగా అందజేయాలన్నారు. సమావేశంలో జిల్లా నోడల్ అధికారి టి వేణుమనోహర్, సాంకేతిక కో-ఆర్డినేటర్ బేతి రాజేందర్, డీఆర్‌పీ బీ రవినందన్‌రావు, శ్రీకాంత్ జిల్లాలోని వివిధ మండలాల ఎంఎస్ కో-ఆర్డినేటర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

200
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS