చరిత్రలో నిలిచేలా అభివృద్ధి


Tue,January 10, 2017 02:45 AM


మంథని, నమస్తే తెలంగాణ: స్వరాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన టీఆర్‌ఎస్ పార్టీ, అధికారంలోకి వచ్చాక చరిత్రలో నిలిచిపోయేలా అభివృద్ధి పనులు చేపడుతుందని మంథని ఎమ్మెల్యే పుట్ట మధు అన్నారు. సోమవారం మంథనిలోని తన నివాసం వద్ద నియోజకవర్గంలోని కాటారం మండలం ధన్‌వాడ, శంకరంపల్లి గ్రామాలకు చెం దిన 20 మంది యువకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ఏకైక పార్టీ టీఆర్‌ఎస్ అ న్నారు. నాడు తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చేందు కు ఉద్యమించామన్నారు. సాధించిన రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు నిరంతర కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అవసరాలను తీర్చుతూ భవిష్యత్ తరాలకు అభివృద్ధి ఫలాలు అందేలా సీఎం కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. పార్టీలో చేరుతున్న నాయకులు అందరు ఒకరికొకరు సహకరించుకుంటూ సమస్యల పరిష్కారానికి కృషి చే యాలని సూచించారు.

కాటారం సింగిల్ విండో చైర్మన్ తుల్సెగారి శంకరయ్య, ఎస్సీ సెల్ అధ్యక్షు డు భూపెల్లి రాజుల ఆధ్వర్యంలో ముంత రవి, విడిదివేని రవితేజ, పసుల రమేశ్, ఆత్కూరి శ్రీకాంత్, జంగ రమేశ్, సూరం శ్రీకాంత్, కొండ్ర రామకృష్ణ, పుట్ట శ్రీకాంత్, బాపిషగండు అరుణ్, పసుల శ్రీనివాస్, కందికొండ ప్రశాంత్, కందికొండ మహేశ్, దేవేందర్ చేరగా, ఎమ్మెల్యే టీఆర్‌ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మంథని సర్పంచ్ పుట్ట శైలజ, ఎంపీపీ ఏగోళపు కమల, జడ్పీటీసీ మూల సరోజన, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు వేల్పుల గట్టయ్య, ఎస్‌కే యాకూబ్, ఏగోళపు శంకర్‌గౌడ్ పాల్గొన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS