ఆంక్షల ఎత్తివేతకు యాజమాన్యం ఒకే : టీబీజీకేఎస్


Tue,January 10, 2017 02:44 AM

గోదావరిఖని, నమస్తే తెలంగాణ : వారసత్వ ఉద్యోగాల దరఖాస్తులపై అధికారులు పెడుతున్న ఆంక్షలను ఎత్తివేసేందుకు సింగరేణి సంస్థ డైరెక్టర్ (పా) పవిత్రన్‌కుమార్ అంగీకరించారని టీబీజీకేఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.వెంకట్రావ్, కెంగర్ల మల్లయ్య, ఉపాధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, ఆకునూరి కనకరాజు తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో డైరెక్టర్ (పా)తో టీబీజీకేఎస్ నేతలు సమావేశమై, పలు అంశాలపై చర్చించనట్లు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో పేర్కొన్న విధంగా వారసత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారి వయసు 40 సంవత్సరాలుగా సవరించాలని కోరగా అసెంబ్లీ నుంచి మినిట్స్ రాగానే, అమలు చేస్తామని హామీ ఇచ్చారన్నారు.

ఇది వన్ టైం సెటిల్‌మెంట్‌గా, మార్చిలోగా దరఖాస్తు చేసుకుంటేనే వర్తిస్తుందని తెలిపారు. సింగరేణి రికార్డుల్లో ఒక వయసు, సర్టిఫికెట్లలో మరో వయసు ఉందని అధికారులు ఇబ్బంది పెట్టడం సరికాదని, పదో తరగతి మార్కుల జాబితాను పరిగణలోకి తీసుకునేందుకు అంగీకరించినట్లు చెప్పారు. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకు డిపెండెంట్ సర్టిఫికెట్ అవసరం లేదని డైరెక్టర్ (పా) అంగీకరించారని తెలిపారు. వివాహానికి ఈపీఆర్‌లో లేకుంటా ఆధారాలు చూపిస్తే సరిపోతుందన్నారు. రెండేళ్ల సర్వీసు వదులుకొని దరఖాస్తు చేసుకుంటున్న వారికి వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని, నెలకు 550 మందికి శిక్షణ ఇవ్వాలని కోరితే డైరెక్టర్ (పా) సానుకూలంగా స్పందించారని టీబీజీకేఎస్ నేతలు పేర్కొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS