క్రీడలతో మానసికోల్లాసం


Tue,January 10, 2017 02:44 AM

యైటింక్లయిన్‌కాలనీ : క్రీడలు మానసికోల్లాసా న్ని ఇస్తాయని మంథని ఎమ్మెల్యే పుట్ట మధు అన్నారు. సోమవారం అబ్దుల్ క్రీడామైదానంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలు మూడో రోజు కొనసాగాయి. ఎమ్మె ల్యే మధు, రామగుండం నగర మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, తెలంగాణ రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శి సోమారపు అరుణ్ హాజరై పోటీలను ప్రారంభించి, మాట్లాడారు. ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంస్థను నెలకొల్పి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను, బతుకమ్మ పండుగను ప్రపంచానికి చాటి చెప్పారని గుర్తు చేశారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు జాగృతి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. టోర్నమెంటు ఇన్‌చార్జి బొగ్గుల సాయికృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జాగృతి రామగుం డం నియోజకవర్గ ఇన్‌చార్జి అందె సదానందం, కార్పొరేటర్లు మందల కిషన్‌రెడ్డి, రవినాయక్, స్టాలిన్ గౌడ్, ఐలి శ్రీనివాస్, మాల్లారెడ్డి, శోభారాణి తదితరులు పాల్గొన్నారు.

115
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS