కోడ్‌పై అభిప్రాయ సేకరణ


Tue,January 10, 2017 02:43 AM


గోదావరిఖని, నమస్తే తెలంగాణ : త్వరలో సింగరేణిలో జరుగనున్న గుర్తింపు కార్మిక సం ఘం ఎన్నికల కోడ్ ఆఫ్ డిసిప్లేన్‌పై సోమవారం యామాన్యం అభిప్రాయాలు సేకరించింది. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో జరిగిన సమావేశంలో సింగరేణి సంస్థ డైరెక్టర్ (పా) పవిత్రన్‌కుమార్‌తో పాటు జీఎం (పర్సనల్) ఆనందరావు, డీజీఎం (పర్సనల్) అనిల్ కార్మిక సంఘాల అభిప్రాయాలు సేకరించారు. ఈ క్రమంలో ప్రస్తుత గుర్తింపు కార్మిక సంఘమైన టీబీజీకేఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.వెంకట్రావ్, కెంగెర్ల మల్ల య్య ప్రస్తుతం ఉన్న నాలుగేళ్ల కాలపరిమితి కొనసాగించాలని, ఎలాంటి మార్పులు చేయొద్దని కో రారు. హెచ్‌ఎంఎస్ తరఫున ఆ యూనియన్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, ఐఎన్టీయూసీకి చెందిన ఓ వర్గం నాకులు ఎలాంటి మార్పు లు లేకుండా, యథావిధిగా కొనసాగించాలని కో రారు.

ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, బీఎంఎస్, సీఐటీయూ, టీఎన్టీయూసీ, ఇప్టూ, ఏఐఎఫ్‌టీ యూ సంఘాలు మాత్రం రెండేళ్ల కాలపరిమితితో ఎన్నికలు జరపాలని కోరాయి. ఎన్నికల్లో గెలిచిన, ఓడిన సంఘాలు గనులపై మీటింగులు పెట్టుకునే అవకాశం కల్పించాలని, చందాలు వసూలు చేసుకునే అవకాశం కల్పించాలని, అది కార్మికుల పేషి ట్ ద్వారా రికవరీ చేయాలని కోరారు. కాగా, సింగరేణిలో గతంలో అధిక ఓట్లు పొందిన సంఘాల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తారా? లేకుంటే మెజార్టీ కార్మిక సంఘాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారా? లేదా ? అనేది తేలాల్సి ఉంది. సమావేశంలో టీబీజీకేఎస్ నాయకులు బి.వెంకట్రావ్, కెంగెర్ల మల్లయ్య, ఏఐటీయూసీ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, వై.గట్ట య్య, హెచ్‌ఎంఎస్ నేత రియాజ్ అహ్మద్, కొలిపాక వీరస్వామి, ఐఎన్టీయూసీ నాయకులు జనక్‌ప్రసాద్, నర్సింహారెడ్డి, బీఎంఎస్ నాయకులు చింతల సూర్యనారాయణ, సీఐటీయూ నాయకులు తుమ్మల రాజారెడ్డి, మంద నర్సింహారావు, ఇప్టూ నాయకులు సాదినేని వెంకటేశ్వర్‌రావు, ఉద్యోగుల సంఘం నేత రాజన్న, టీఎన్టీయూసీ నేత పెద్దపలి సత్యనారాయణ పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS