ఎన్టీపీసీ ఎదుట నిర్వాసితుల నిరసన

Tue,January 10, 2017 02:43 AM

జ్యోతినగర్ : ఎన్టీపీసీ ఎదుట భూ నిర్వాసితులు సోమవారం ఆం దోళన చేపట్టారు. నిర్వాసితులకు ఇ వ్వాల్సిన క్యాజువల్ ఉద్యోగాలను ఇ తరులకు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ ఎన్టీపీసీ ఒకటో గేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ తమ భూములను తీసుకున్న అధికారు లు, ఉద్యోగాలిచ్చి కూ డు పెట్టాలంటూ ప్లేట్లతో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. భోజన విరా మ సమయంలో అధికారులు బయటకు వెళ్లకుం డా భైఠాయించారు. రెగ్యులర్ ఉద్యోగాలు ఖాళీ అయితే, క్యాజువల్ ఉద్యోగాలు ఇస్తామని బదిలీపై వెళ్లిన ఈడీ పీకే మహాపాత్ర హామీ ఇచ్చారన్నారు.

ఆయన బదిలీపై వెళ్లడంతో ఏజీఎం హెచ్ ఆర్ రమేశ్ 14 క్యాజువల్ ఉద్యోగాలను అమ్ముకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను విధుల నుంచి తొలగించి, నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పైరవీలకు తావులేకుండా యాజమాన్యం నియామకాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నిర్వాసితుల సంఘం నాయకులు మాదరబోయిన కొమురయ్య, దాడి మురళి, పి శంకరయ్య, ఎం రాజేశం, పాపయ్య, బాపు, ఈదునూరి కుమారి తదితరులు పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...